TarakaRatna: తారకరత్న పోరాడుతున్నాడు, వచ్చేస్తాడు: ఎన్టీఆర్
కుప్పంలో జరిగిన లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స జరుగుతుండటం తెలిసిందే.
- Author : Anshu
Date : 29-01-2023 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
TarakaRatna: కుప్పంలో జరిగిన లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స జరుగుతుండటం తెలిసిందే. నందమూరి కుటుంబంతో పాటు పలువురు ఇవాళ తారకరత్నను చూడటానికి వచ్చారు. నందమూరి తారకరత్న గురించి హెల్త్ బులిటెన్ విడుదలయ్యాక.. నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకొని, ఆస్పత్రిలోని తారకరత్నను చూడటానికి వచ్చారు.
తారకరత్నను చూసిన అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘తారకరత్న పోరాడుతున్నాడు, వచ్చేస్తాడు’ అని అన్నాడు. అతడి ఆరోగ్యం గురించి ఎన్టీఆర్ వైద్యులను కూడా అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు అనారోగ్యం చేసినప్పటి నుండి అతడితోనే ఉన్న బాలయ్య ఎప్పటికప్పుడు పరిస్థితిని నందమూరి కుటుంబ సభ్యులకు చేరవేస్తూ వస్తున్నాడు.
కాగా తారకరత్నను హీరో మంచు మనోజ్ ఆస్పత్రికి వెళ్లి చూశాడు. తన మిత్రుడిని ఆస్పత్రి బెడ్ మీద అలా చూసి వెంటనే మంచు మనోజ్ కన్నీటిని ఆపుకోలేక ఏడ్చేశాడు. ఎన్టీఆర్ కూడా కన్నీరుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా తారకరత్న, తారక్, మంచు మనోజ్ మంచి మిత్రులు, చిన్నప్పటి నుండి అన్నదమ్ముల్లా పెరగడంతో వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. మంచు మనోజ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.
మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తారకరత్నను చూడటం జరిగింది. రికవరీ అవుతున్నాడు. చిన్నప్పటి నుండి తారకరత్న తెలుసు. నాకు నమ్మకం ఉంది. త్వరలోనే ఆయన కోలుకొని బయటకు వచ్చేస్తాడు. అతడు స్ట్రాంగ్ ఫైటర్, మళ్లీ వచ్చి.. యాక్టివ్ గా మారిపోతాడు. మొదటి నుండి కూడా తారకరత్న చాలా యాక్టివ్. అతను చేసిన ర్యాలీలు, ప్రచారాలు చూస్తూనే ఉంటాను. మంచి వ్యక్తి. ఇంతలోనే అనుకోకుండా ఇలా జరిగింది. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. పోతూ ఉంటుంది. అతనికి ఇది టెస్టింగ్ టైం. అతను మళ్లీ తిరిగి వస్తాడు. నేను వంద శాతం కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆ దేవడి దయవల్ల త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నా. మీరు కూడా దేవుడిని ప్రార్థించండి. వైద్యులతో మాట్లాడాను. వారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు’ అని అన్నాడు.