మిల్కీ బ్యూటీ క్రేజ్.. మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా టెన్త్ ప్లేస్!
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం.. రెండు తోడవ్వడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
- By Balu J Published Date - 04:52 PM, Fri - 22 October 21

మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం.. రెండు తోడవ్వడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. బాహుబాలిలో అవంతిగా అలరించినా.. మాస్ట్రో మూవీ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసినా.. తమన్నాకే చెల్లుతుంది. ఒకవైపు మెయిన్ హీరోయిన్ గా వర్క్ చేస్తూనే, మరోవైపు కథా బలమున్న పాత్రల్లోనూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వరుస సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తున్న తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.
ఫోర్బ్స్ ఇండియా ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా హీరోయిన్స్ (సౌత్) జాబితాలో తమన్నా పదో స్థానం దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఏ హీరోయిన్ టాప్స్ లో ఉన్నారో తెలుసుకునేందుకు ఫోర్బ్స్ ఇండియా ఓ సర్వే చేసి జాబితాను విడుదల చేసింది. అందులో అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా స్టార్స్ లో తమన్నా పదో స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది.
నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్ మాస్ట్రో లో నటించింది తమన్నా. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో తమన్నా మొదటి నెగిటివ్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. తమన్నా యాక్టింగ్ చూసి ఓ చిన్నారి ఎమోషన్ కావడం వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ‘తమన్నా బ్రెయిన్ మార్చారు.. ఎందుకు అందర్నీ చంపుతుంది’ అంటూ కంటతడి పెట్టింది. యూత్ లో కాకుండా పిల్లలోనూ తమన్నా మంచి క్రేజ్ ఉందని చెప్పక తప్పదు.
Related News

PM Modi: సోనియాగాంధీకి మోడీ బర్త్ డే విషెస్
సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.