Tamannaah Bhatia : విజయ్ వర్మ కంటే ముందు రెండు సార్లు లవ్‌లో.. తమన్నాకు రెండు బ్రేకప్‌లు..
తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో తమన్నా తన పాత రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడింది
- By News Desk Published Date - 05:31 PM, Sun - 8 September 24
Tamannaah Bhatia : స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 19 ఏళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. సౌత్ తో పాటు బాలీవుడ్(Bollywood) లో కూడా స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. హీరోయిన్ గా చేస్తూనే ఐటెం సాంగ్స్ తో కూడా మెప్పిస్తుంది. తమన్నా గత కొన్నాళ్లుగా నటుడు విజయ్ వర్మతో(Vijay Varma) రిలేషన్ లో ఉన్న సంగతి అధికారికంగానే ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది.
అయితే తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో తమన్నా తన పాత రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడింది. విజయ్ వర్మ కంటే ముందు ఇద్దర్ని లవ్ చేసిందని, ఇద్దరితో బ్రేకప్ అయిందని తెలిపింది.
తమన్నా తన రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాకు రెండు సార్లు బ్రేకప్ అయింది. టీనేజ్ లో ఉన్నప్పుడే ఒకసారి బ్రేకప్ జరిగింది. ఒక వ్యక్తి కోసం నాకు నచ్చిన జీవితంను వదులుకోకడం నాకు నచ్చలేదు. నాకు లైఫ్ లో చాలా సాధించాలని ఉండేది. కానీ అవతలి వ్యక్తి అది అర్ధం చేసుకోలేదు. ఆ కారణంతో బ్రేకప్ అయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంత కాలం రిలేషన్ లో ఉన్నాను. అతను నాకు సెట్ కాడు అనిపించింది. ప్రతి విషయానికి అబద్దం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తితో బంధం ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే ఆ బంధం కూడా ముగిసింది అని తెలిపింది. ఇక ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. గత కొన్నాళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది.
Also Read : Bhagyashri Borse : ‘మిస్టర్ బచ్చన్’ భామ.. భారీ ఛాన్స్ కొట్టేసిందిగా.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలో..