Sushmita Sen: సుస్మితా సేన్ కు గుండెపోటు.. సోషల్ మీడియాలో ఎమోషన్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ (Sushmita Sen) ఇటీవల గుండెపోటుకు గురైనట్లు వెల్లడించింది.
- Author : Balu J
Date : 02-03-2023 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఈతరం హీరోహీరోయిన్స్ (Actors) ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. చర్మ సంబంధ, గుండె, కిడ్నీ లాంటి ఇతర అనారోగ్య వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ (Sushmita Sen) గుండెపోటుకు గురైనట్లు వెల్లడించింది. ఆర్య 3 మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సుస్మిత సోషల్ మీడియాలో తన తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) కు సంబంధించిన యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నట్లు అభిమానులకు తెలియజేసింది. ఫొటోలో సుస్మిత తన తండ్రిని కౌగిలించుకుంది. ఆమె గోల్డెన్ నెట్ చీర ధరించి, తండ్రీ తో నవ్వులు చిందిస్తూ కనిపించింది (Sushmita Sen).
“మీ హృదయాన్ని సంతోషంగా & ధైర్యంగా ఉంచుకోండి. మీకు అవసరమైనప్పుడు అది మీకు అండగా నిలుస్తుంది” (నాన్న చెప్పిన మాటలు). నేను కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో బాధపడ్డాను. యాంజియోప్లాస్టీ పూర్తయింది.స్టెంట్ కూడా వేయబడింది. ముఖ్యంగా నా కార్డియాలజిస్ట్ ‘నాకు పెద్ద హృదయం ఉంది’ అని మళ్లీ ధృవీకరించారు. అంతా బాగానే ఉంది & నేను మళ్ళీ కొంత జీవితానికి సిద్ధంగా ఉన్నాను! నేను మిమ్మల్ని మించి ప్రేమిస్తున్నాను అంటూ ఎమోషన్ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా పోస్ట్ తో సుస్మితా సేన్ (Sushmita Sen) ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Mahesh Babu Looks: కండలు పెంచిన మహేశ్.. లేటెస్ట్ ఫొటో వైరల్!