Suriya – Mother : అమ్మ చేసిన అప్పు తీర్చేందుకు సినిమాల్లోకి వచ్చా : సూర్య
హీరో సూర్య లైఫ్‌లోని(Suriya - Mother) కష్టాల కోణాన్ని ఆవిష్కరించే ఒక కీలక విషయం తాజాగా బయటికి వచ్చింది.
- By Pasha Published Date - 04:29 PM, Thu - 24 October 24

Suriya – Mother : హీరో సూర్యను అందరూ రియల్ హీరోగా కొనియాడుతుంటారు. ఆయన చేసే సమాజ సేవా కార్యక్రమాలు అలా ఉంటాయి మరి. అయితే సూర్య.. రాత్రికి రాత్రి సూపర్ స్టార్‌గా ఎదగలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లను చూశారు. వాటన్నింటిని దాటుకొని సూర్య అందరూ మెచ్చుకునే రేంజుకు ఎదిగారు. హీరో సూర్య లైఫ్‌లోని(Suriya – Mother) కష్టాల కోణాన్ని ఆవిష్కరించే ఒక కీలక విషయం తాజాగా బయటికి వచ్చింది. దాన్ని స్వయంగా సూర్యనే వెల్లడించారు. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశం
- హీరో సూర్య తన చదువు పూర్తికాగానే ఓ గార్మెంట్ కంపెనీలో జాబ్‌లో చేరారు.
- గార్మెంట్ కంపెనీలో సూర్యకు తొలుత ప్రతి 15 రోజులకు రూ.750 చొప్పున శాలరీ ఇచ్చేవారు.
- మూడు సంవత్సరాల తర్వాత గార్మెంట్ కంపెనీలో సూర్య నెలవారీ శాలరీ రూ.8000కు చేరింది.
- తాను కూడా ఏదో ఒకరోజు సొంతంగా గార్మెంట్ కంపెనీని పెట్టాలని సూర్య భావించేవాడు. సినిమా ఇండస్ట్రీ గురించి సూర్య అస్సలు ఆలోచించేవాడు కాదు.
- సూర్య వాళ్ల అమ్మ అప్పట్లో బ్యాంకులో రూ.25వేల లోన్ తీసుకుంది. అయితే సూర్య వాళ్ల నాన్నకు చెప్పకుండా ఆమె ఈ లోన్ తీసుకున్నారు. ఈవిషయాన్ని తన కొడుకు సూర్యకు ఆమె చెప్పింది.
- ఆ బ్యాంక్ లోన్‌ను తీరుస్తానని అమ్మకు సూర్య మాట ఇచ్చాడు.
- ఈక్రమంలో ఆనాడు మణిరత్నం తీసిన ఒక మూవీలో వచ్చిన ఒక అవకాశాన్ని సూర్య వాడుకున్నాడు. ఆ మూవీలో నటించడం ద్వారా వచ్చిన డబ్బుతో తన తల్లి తీసుకున్న బ్యాాంకు లోన్‌ను సూర్య తీర్చేశాడు.
- అనుకోకుండా ఆ సినిమాతో సినీ ఇండస్ట్రీలో సూర్యకు మంచి పేరు వచ్చింది. క్రమక్రమంగా ఆయన మూవీ ఇండస్ట్రీలో హైరేంజుకు ఎదిగారు.
- సూర్యతో మణిరత్నం తీసిన తొలి సినిమా పేరు ‘ఓ నెర్రుక్కు నెర్’. 1997లో ఈ మూవీ విడుదలైంది. ఈ మూవీలో విజయ్ హీరోగా నటించారు. సూర్య కీలకపాత్ర పోషించారు.