Coca Cola Vs Reliance : రిలయన్స్ ‘కాంపా’ ఎఫెక్ట్.. పెప్సీ, కోకకోలా కీలక నిర్ణయం
వివిధ ప్రాంతాల్లో అక్కడి ప్రజల అభిరుచికి అనుగుణంగా ప్రాంతీయ ప్రోడక్ట్‌లను విడుదల చేసే అంశాన్ని సైతం పెప్సీ, కోకకోలాలు(Coca Cola Vs Reliance) పరిశీలిస్తున్నాయట.
- By Pasha Published Date - 03:09 PM, Thu - 24 October 24

Coca Cola Vs Reliance : కూల్ డ్రింక్స్ మార్కెట్లోనూ భారతీయ బ్రాండ్ ‘రిలయన్స్’ సత్తా చాటుకుంటోంది. విదేశీ కంపెనీలైన పెప్సీ, కోక కోలాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) ‘కాంపా’ పేరుతో సాఫ్ట్ డ్రింక్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. ఈ ఎఫెక్టుతో పెప్సీ, కోకకోలాలు మెట్టుదిగాయి. తమ కూల్ డ్రింక్స్ ధరలను తగ్గించాలనే ఆలోచనను అవి మొదలుపెట్టాయి.
Also Read : United Nations Day 2024 : ఇండియా వాంట్ ‘వీటో పవర్’.. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరిగేనా ?
కాంపా తరహాలో తక్కువ ధరకే కొన్ని ప్రోడక్ట్స్ తేవాలని అవి యోచిస్తున్నాయి. పెప్సీ, కోకకోలాలు ప్రస్తుతమున్న తమ ప్రోడక్ట్స్ ధర కంటే దాదాపు 20 శాతం తక్కువ రేట్లకే కొత్త ప్రోడక్ట్స్‌ను మార్కెట్లోకి తెచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రిలయన్స్ కాంపా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే ఇంతకు మించిన మార్గం మరొకటి లేదని పెప్సీ, కోకకోలా భావిస్తున్నాయట. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ప్రోడక్ట్స్ ధరలను ఈ కంపెనీలు తగ్గించే ఛాన్స్ మాత్రం లేదు. కాంపాను ఢీకొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి ప్రజల అభిరుచికి అనుగుణంగా ప్రాంతీయ ప్రోడక్ట్‌లను విడుదల చేసే అంశాన్ని సైతం పెప్సీ, కోకకోలాలు(Coca Cola Vs Reliance) పరిశీలిస్తున్నాయట.
Also Read :Gold VS Diamond : బంగారం వర్సెస్ వజ్రాలు.. ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏది బెటర్ ?
- ప్రస్తుతం రిలయన్స్ ‘కాంపా’ 200 ఎంఎల్ బాటిల్ ధర రూ.10. కోకకోలా, పెప్సికో 250 ఎంఎల్ బాటిల్ ధర రూ.20.
- 500 ఎంఎల్ కాంపా బాటిల్ ధర రూ.20. ఇదే మోతాదులో సాప్ట్ డ్రింక్ కలిగిన కోక కోలా ధర రూ.30, పెప్సికో ధర రూ.40.
- గోల్డ్ స్పాట్, డబుల్ సెవెన్, కాంపా కోలా వంటి స్వదేశీ బ్రాండ్స్ 1990వ దశకం వరకు మన దేశంలో బాగా నడిచాయి.
- అయితే 1990వ దశకం నుంచి మనదేశంలో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. పెప్సీ, కోకకోలా వంటి విదేశీ కూల్ డ్రింక్స్ బ్రాండ్లు ప్రవేశించి మార్కెట్‌ను హస్తగతం చేసుకున్నాయి.
- 34 ఏళ్ల గ్యాప్ తర్వాత వాటిని ఛాలెంజ్ చేసేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చొరవ చూపారు. కాంపాను తిరిగి భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చారు.