Kanguva : దివాళీ పై కన్నేసిన ‘కంగువ’.. మన ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్ మాత్రం తెలియడం లేదు..
దివాళీ పై కన్నేసిన 'కంగువ'. కానీ మన 'గేమ్ ఛేంజర్' మాత్రం తన ప్లాన్ తెలియజేయడం లేదు.
- By News Desk Published Date - 05:56 PM, Sat - 18 May 24

Kanguva – Game Changer : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. టైం ట్రావెల్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ కచ్చితమైన టైం పీరియడ్ అయితే చెప్పలేదు. అయితే తాజాగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ టైంని ఫిక్స్ చేసుకున్నారట.
ఈ సినిమాని దివాళీ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ్ మీడియాలో బాగా వైరల్ అవువుతుంది. ఈ వార్త సూర్య అభిమానులను సంతోషపరుస్తుంటే.. రామ్ చరణ్ అభిమానులను మాత్రం కలవరపెడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ దివాళీకి రాబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అక్టోబర్ 31న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవ్వడం పక్కా అంటూ వార్తలు వచ్చాయి.
కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. ఈ ఏడాది కొంచెం ఖాళీ ఉన్న తేదీ అంటే దివాళీ సమయమే. ఎందుకంటే జూన్ నుంచి పాన్ ఇండియా సినిమాల సందడి ఉండబోతుంది. కల్కి, పుష్ప, దేవర, ఓజి వంటి టాలీవుడ్ సినిమాలతో పాటు.. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి తమిళ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
వీటిలో తెలుగు సినిమాలు అన్ని రిలీజ్ డేట్స్ ని ఖరారు చేసుకొని కూర్చున్నాయి. తమిళ్ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఒక దివాళీ తేదీని కూడా తమిళ్ సినిమా ఆక్రమించుకుంటే.. గేమ్ ఛేంజర్ రిలీజ్ కి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మరి మేకర్స్ ఏ డేట్ ని ఫిక్స్ చేస్తారో చూడాలి.