Premalu : ప్రేమలు అక్కడ వరస్ట్ రికార్డ్..!
జీ తెలుగులో ఈమధ్యనే టెలికాస్ట్ అయిన ప్రేమలు సినిమాను అసలు ఆడియన్స్ ఏమాత్రం పట్టించుకోలేదు. యూత్ ఆడియన్స్ అంతా కూడా సినిమాను
- By Ramesh Published Date - 11:20 PM, Thu - 29 August 24

మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాను తెలుగులో కార్తికేయ రిలీజ్ చేశాడు. నెస్లెన్, మమితా బైజు (Mamitha Baiju) లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను గిరీష్ డైరెక్ట్ చేశారు. సినిమా సక్సెస్ ఈవెంట్ లో రాజమౌళి కూడా వచ్చి చిత్ర యూనిట్ లో జోష్ నింపారు. థియేట్రికల్ రిలీజై సూపర్ హిట్టైన ప్రేమలు డిజిటల్ రిలీజ్ లో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఐతే ఈమధ్యనే బుల్లితెర మీద వరల్డ్ ప్రీమియర్ షో వేయగా అక్కడ మాత్రం ప్రేక్షకుల చేత రిజెక్ట్ చేయబడింది.
అలా ఇలా కూడా కాదు ప్రేమలు సినిమాకు బుల్లితెర మీద వరస్ట్ రేటింగ్ నమోదైంది. జీ తెలుగులో ఈమధ్యనే టెలికాస్ట్ అయిన ప్రేమలు సినిమాను అసలు ఆడియన్స్ ఏమాత్రం పట్టించుకోలేదు. యూత్ ఆడియన్స్ అంతా కూడా సినిమాను సూపర్ హిట్ చేస్తే ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాను రిజెక్ట్ చేశారు.
జీ తెలుగులో ఈమధ్యనే ప్రసారమైన ప్రేమలు సినిమాకు 2.87 టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. ఇది చాలా లీస్ట్ రేటింగ్ అని చెప్పొచ్చు. థియేట్రికల్ రిలీఎజ్, డిజిటల్ రిలీజ్ లో రికార్డులు నెలకొల్పిన ప్రేమలు ఇలా స్మాల్ స్క్రీన్ మీద మాత్రం వరస్ట్ రికార్డ్ ఏర్పరచుకుంది.
ఐతే ప్రేమలు (Premalu) సూపర్ సక్సెస్ అవ్వడంతో గిరీష్ అదే టీం తో ప్రేమలు 2 చేస్తున్నాడు. కచ్చితంగా ఈ సీక్వెల్ కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంటుందని చెప్పొచ్చు. ఐతే ప్రేమలు సినిమా సీక్వెల్ ఈసారి డైరెక్ట్ గా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఎలాగు పార్ట్ 1 హిట్ అయ్యింది కాబట్టి ప్రేమలు 2 బిజినెస్ విషయంలో కష్టపడాల్సిన అవసరం ఉండదని చెప్పొచ్చు.
Also Read : King Nagarjuna : నాగార్జునలో మాస్ చూపిస్తున్న లోకేష్..?