King Nagarjuna : నాగార్జునలో మాస్ చూపిస్తున్న లోకేష్..?
రజినికాంత్ లోకేష్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాలో సిమన్ రోల్ లో నాగార్జున నటిస్తున్నారు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే
- By Ramesh Published Date - 11:04 PM, Thu - 29 August 24

కింగ్ నాగార్జున తన సోలో సినిమాలతో పాటు మంచి కథ కుదిరితే ఎలాంటి మల్టీస్టారర్ సినిమాలైనా చేస్తాడు. ఇదివరకు చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తితో ఊపిరి సినిమా చేసిన నాగార్జున ఆ సినిమాలో కేవలం వీల్ చెయిర్ కే అంకితమైన పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమా చేశాడు. ఇక ఇప్పుడు ధనుష్ కుబేర సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే.
ఐతే ఇది చాలదు అన్నట్టు కింగ్ నాగార్జున (King Nagarjuna) సూపర్ స్టార్ రజినికాంత్ సినిమాలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో రివీల్ చేశారు మేకర్స్. రజినికాంత్ లోకేష్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాలో సిమన్ రోల్ లో నాగార్జున నటిస్తున్నారు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
నాగార్జునలోని మాస్ యాంగిల్ ని లోకేష్ బయట పెడుతున్నారని చెప్పొచ్చు. ఇక పోస్టర్ రిలీజ్ సనర్భంగా నాగార్జున కూడా లోకేష్ తో ఖైదీ చూసినప్పటి నుంచి అతని డైరెక్షన్ లో చేయాలని అనుకున్నా అది కూలీ (Coolie)తో కుదిరిందని కామెంట్ పెట్టారు. రజిని కూలీలో నాగార్జున నెగిటివ్ రోల్ చేస్తున్నారా లేదా రజినికి సపోర్ట్ గా ఇలా వచ్చి అలా వెళ్తారా అన్నది చూడాలి.
కింగ్ నాగార్జున ఫ్యాన్స్ మాత్రం లోకేష్ డైరెక్షన్ లో నాగ్ సినిమా అఫ్కోర్స్ అది సోలో సినిమా కాకపోయినా నాగార్జున ఇమేజ్ కి తగిన పాత్రనే తీసుకుని ఉంటారని భావిస్తునారు. కుబేర, కూలీ ఈ రెండు సినిమాల్లో నాగార్జున రోల్స్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది.
Also Read : Allu Arjun Thumbs Up : అల్లు అర్జున్ చేతికి థమ్స్ అప్..!