#SDGM : ‘బలుపు’ డైరెక్టర్ భలే ఆఫర్ కొట్టేసాడే..!!
కొద్దీ రోజుల కిందే గోపీచంద్ ముంబై వెళ్లి సన్నీ డియోల్ కి కథ చెప్పాడని, సన్నీ వెంటనే ఓకే చేశాడని సమాచారం
- By Sudheer Published Date - 02:05 PM, Thu - 20 June 24

చిత్రసీమలో అగ్ర హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అనేది ఆషామాషీకాదు..కథలో మంచి దమ్ము, గత చిత్రాల రికార్డ్స్ ఉంటె తప్ప అగ్ర హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాదు..ఇక బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ తెలుగు డైరెక్టర్స్ కు రావాలంటే అది కత్తిమీద సాము లాంటిది. అలాంటిది యంగ్ & మాస్ డైరెక్టర్ కు ఏకంగా యానిమల్ నటుడ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని..ఇప్పుడు బాలీవుడ్ నటుడ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. యానిమల్ , గదర్ 2 సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన “సన్నీ డియోల్” తో గోపీచంద్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తాలూకా అధికారిక ప్రకటన ఈరోజు వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. కొద్దీ రోజుల కిందే గోపీచంద్ ముంబై వెళ్లి సన్నీ డియోల్ కి కథ చెప్పాడని, సన్నీ వెంటనే ఓకే చేశాడని సమాచారం. ఇక అలా ఒకే చేయడమే లేటు. ఇటు సినిమాని అనౌన్స్ చేసేసారు. ఈ అప్డేట్ తెలిసి సినీ ప్రముఖులు , అభిమానులు, నెటిజన్లు గోపీచంద్ ని లక్ అంటే నీదే ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేశావ్ పో ..అంటూ కామెంట్స్ చేస్తున్నారట.
#SDGM వర్కింగ్ టైటిల్ పేరిట నేడు అధికారికంగా ఈ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ మెంట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్, మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించబోతున్నాడు. అయితే ఈ సినిమాను హిందీలో తెరకెక్కించినా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్లుగా సయామీ ఖేర్ మరియు రెజీనా కసాండ్రా నటించబోతున్నారట. ఇక షూటింగ్ తాలూకా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
Excited to announce my next project with the Action Superstar @iamsunnydeol sir! Thrilled to be teaming up with @MusicThaman Bawa @RishiPunjabi5 sir, @NavinNooli brother and @artkolla for #SDGM ❤️
This venture is being produced by the amazing teams at @MythriOfficial &… pic.twitter.com/SKQnwJd6Yu
— Gopichandh Malineni (@megopichand) June 20, 2024
Read Also : CBN Wishes: సీఎం గారు బర్తడే విషెస్..భువనేశ్వరి అదిరిపోయే రిప్లై