HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sunil Narang Resigns As President Of The Telangana Film Chamber

Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

  • Author : Vamsi Chowdary Korata Date : 20-05-2026 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sunil Narang Resigns as President of the Telangana Film Chamber
Sunil Narang Resigns as President of the Telangana Film Chamber

తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ఆయన ఫిలిం ఛాంబర్‌కు అధికారికంగా ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. సునీల్ నారంగ్ సమర్పించిన ఈ రాజీనామాను ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఆమోదించింది.

అయితే, చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రాజీనామా వెనుక టాలీవుడ్‌లో గత కొంతకాలంగా నడుస్తున్న ‘పర్సంటేజీ విధానం’ వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలోనే కలెక్షన్ల పర్సంటేజీ సిస్టమ్ (షేరింగ్ విధానం) అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నిర్మాతలు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదం రోజురోజుకూ ముదరడం, ఎగ్జిబిటర్ల తరఫున నిలబడిన సునీల్ నారంగ్‌పై కొంతమంది నిర్మాతల నుండి తీవ్ర ఒత్తిడి, విమర్శలు రావడంతోనే ఆయన తీవ్ర అసంతృప్తితో పదవి నుంచి తప్పుకున్నట్లు ఫిలిం నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ హఠాత్ పరిణామంతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిలిం చాంబర్ వర్గాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, రేపు తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పంతాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో రాబోయే కొత్త అధ్యక్షుడు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • exhibitors
  • Film Chamber President
  • Movie Theaters
  • Sunil Narang
  • telangana film chambers
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

    • Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

    • Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

    • Trends : శ్రీకాళహస్తిలో ‘ట్రెండ్స్’ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం

    • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd