Ooru Peru Bhairavakona OTT: ఊరి పేరు భైరవకోన ఓటీటీ డేట్ ఫిక్స్.. విడుదలై నెలరోజులు కూడా కాకముందే?
- By Sailaja Reddy Published Date - 04:56 PM, Mon - 4 March 24
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సందీప్. ఇది ఇలా ఇంటే సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్ లుగా నటించారు.శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు.
వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నిజమేనే చెబుతున్న అనే సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పాట వినిపిస్తుంది. ఇక ఊరుపేరు భైరవ కోన సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబందించిన ఒక అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఊరుపేరు భైరవ కోన సినిమా మార్చ్ 15న ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. మరో ఓటీటీ సంస్థ ఆహాలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ రెండు ఓటీటీలో దేనిలో ఊరుపేరు భైరవ కోన సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి మరి. అయితే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం నెల రోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ పేరు వినిపిస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Related News
Vijay Devarakonda The Family Star OTT Talk : ది ఫ్యామిలీ స్టార్.. OTT టాక్ ఎలా ఉందంటే..?
సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టే రిస్క్ చేయట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం