Siddhu Jonnalagadda : టిల్లు బోయ్ తో సినిమా.. రెమ్యూనరేషన్ అంత ఇవ్వాల్సిందేనా..?
Siddhu Jonnalagadda డీజే టిల్లు సినిమాతో తన ఫేట్ మార్చేసుకున్నాడు యువ హీరో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. సినిమాల్లో ఎలాగైనా రాణించాలనే
- By Ramesh Published Date - 06:50 PM, Fri - 17 May 24

Siddhu Jonnalagadda డీజే టిల్లు సినిమాతో తన ఫేట్ మార్చేసుకున్నాడు యువ హీరో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. సినిమాల్లో ఎలాగైనా రాణించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా తన మార్క్ సెట్ చేసుకున్నాడు. డీజే టిల్లు ముందు సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఆ క్రేజ్ తోనే టిల్లు స్క్వేర్ తీశాడు.
టిల్లు స్క్వేర్ ఏకంగా 100 కోట్లు వసూళ్లను రాబట్టడంతో సిద్ధుతో సినిమా చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు పడేసరికి సిద్ధు కూడా రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.
డీజే టిల్లు హిట్ తో టిల్లు స్కేర్ సినిమాకు 5 కోట్లు మాత్రమే తీసుకున్న సిద్ధు టిల్లు స్క్వేర్ 100 కోట్లు కొట్టడంతో రెమ్యునరేషన్ డబుల్ కాదు ట్రిపుల్ చేశాడని తెలుస్తుంది. అంటే మొన్నటిదాకా 5 కోట్లు తీసుకున్న సిద్ధు కాస్త ఇప్పుడు సినిమాకు 15 కోట్లు ఇస్తేనే అంటున్నాడట. సిద్ధు క్రేజ్ కి నిర్మాతలు అతను అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే సిద్ధు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సిద్ధు ముందే కమిట్ అవ్వడంతో 5 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నాడట. అయితే నెక్స్ట్ చేయబోయే సినిమాలకు సిద్ధు కచ్చితంగా 15 కోట్లు ఇస్తేనే అంటున్నాడని టాక్. ఏది ఏమైనా సిద్ధు జొన్నలగడ్డ ఇన్నాళ్లకు సరైన ఫాం లోకి వచ్చాడని చెప్పొచ్చు. కష్టే ఫలి అని పెద్దలు చెప్పిన మాట ఇలాంటి వారు సక్సెస్ కొట్టినప్పుడు నిజమని మరోసారి ప్రూవ్ అవుతుంది.
Also Read : Jagapati Babu : జపాన్ లో జగపతి బాబుకి మైండ్ బ్లాక్ ఫాలోయింగ్.. లేడీ ఫ్యాన్స్ తో జగ్గు భాయ్ వీడియో వైరల్..!