HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ssmb 29 Rajamouli To Unveil The Trailer At Rfc Event

SSMB 29 Trailer: నవంబర్ 15న మ‌హేష్ బాబు- రాజ‌మౌళి మూవీ ట్రైలర్ విడుదల?

ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్‌లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Author : Gopichand Date : 11-11-2025 - 5:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SSMB 29 Trailer
SSMB 29 Trailer

SSMB 29 Trailer: రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29 గురించిన అప్‌డేట్‌లు సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతున్నాయి. నిన్న (సోమవారం) అనూహ్యంగా విడుదలైన చిత్రంలోని మొదటి సింగిల్ ‘సంచారి’ అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. ఈ పాట విడుదల కావడంతో ఈ చిత్రం తదుపరి అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

నవంబర్ 15న మెగా ఈవెంట్, ఊహించని ట్విస్ట్!

SSMB 29 చిత్ర బృందం నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మెగా ఈవెంట్‌ (SSMB 29 Trailer)ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందని ఇప్పటికే ప్రకటించింది. ఈ వేదికపై సినిమా గురించి ఎలాంటి కీలక ప్రకటన వస్తుందోనని మహేష్, రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఈవెంట్ అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి అయిన జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఒక సంచలనాత్మక ట్వీట్‌తో మరింత ఆసక్తిని పెంచింది.

Also Read: Delhi Bomb Blast: డాక్ట‌ర్ ఉమ‌ర్ మ‌హ‌మ్మ‌ద్‌ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?

When legends unite, history is made ❤️
Join Mahesh Babu, Priyanka Chopra & Prithviraj Sukumaran LIVE for a never before seen reveal of #GlobeTrotter

📍15th November, 7 PM onwards, only on JioHotstar#GlobeTrotterEvent #GlobeTrotter pic.twitter.com/EFj4YpDcTL

— JioHotstar (@JioHotstar) November 11, 2025

కొద్దిసేపటి క్రితం జియో హాట్‌స్టార్ తమ అధికారిక ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. నవంబర్ 15న జరగబోయే ఆ గ్రాండ్ ఈవెంట్‌లో SSMB 29 ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు. అయితే ఊహించని విధంగా ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆ ట్వీట్‌ను కొద్దిసేపటికే తొలగించింది.

పోస్ట్ డిలీట్ వెనుక కారణం ఏమై ఉంటుంది?

జియో హాట్‌స్టార్ పోస్ట్ తొలగించబడటం అభిమానుల్లో మరింత గందరగోళాన్ని సృష్టించింది. అసలు ట్రైలర్ విడుదల ఖరారైందా? లేదా సాంకేతిక లోపం వల్ల పోస్ట్ చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ విడుదల అనేది సాధారణంగా సినిమా విడుదలకు కొద్ది నెలల ముందు జరుగుతుంది. ఈ కీలక అప్‌డేట్ ఇప్పుడే వస్తున్నట్లు ప్రకటించడం, అది కూడా సినిమా విడుదలకు చాలా ముందే విడుదల చేయడం, ఈ ప్రాజెక్ట్ గురించి అభిమానుల అంచనాలను రెట్టింపు చేసింది.

ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్‌లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఎలాంటి అప్‌డేట్ వస్తుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cinema News
  • Globetrotter
  • mahesh babu
  • RFC Event
  • ss rajamouli
  • SSMB 29 Trailer

Related News

Jana Nayagan

విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో సామాజిక, రాజకీయ సందేశం బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    Latest News

    • వాట్సాప్ లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తున్నారా ? అయితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్లే !!!

    • మరోసారి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్

    • తండ్రి కాబోతున్న నాగచైతన్య , నిజమేనా ?

    • విషాదాలకు కేరాఫ్ గా 2025 , ఎన్నో కుటుంబాల్లో కన్నీరు మిగిల్చిన ఈ ఏడాది

    • ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని

    Trending News

      • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

      • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd