Sreeleela Beats Pooja: పూజాహెగ్డే వద్దు.. శ్రీలీల ముద్దు: యంగ్ బ్యూటీకి ఆఫర్లే ఆఫర్లు!
అందం, అభినయం రెండు తోడు కావడంతో ధమాకా బ్యూటీని సెలక్ట్ చేసుకునేందుకు నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపుతున్నారు.
- By Balu J Published Date - 02:03 PM, Sat - 4 March 23

తెలుగు తెరపై ధమాకా బ్యూటీ శ్రీలీల (Sreeleela) జట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అందం, అభినయం రెండు తోడు కావడంతో ఈ బ్యూటీని సెలక్ట్ చేసుకునేందుకు నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అర డజన్ పైగా సినిమాలు ఈ బ్యూటీలో చేతిలో ఉన్నాయి. భారీ బడ్జెట్ మూవీ అవకాశాలను కూడా ఈ హీరోయిన్ సొంతం చేసుకుంటుంది. శ్రీలీల (Sreeleela) జోరు మీద ఉండటంతో పెద్ద పెద్ద హీరోయిన్స్ సైతం ప్రభావం చూపలేకపోతున్నారు.
టాలీవుడ్ బుట్టబొమ్మ సైతం అవకాశాల్లేక వెనుకబడిపోతుందంటే శ్రీలీల జోరు ఏవిధంగా తెలుసుకోవచ్చు. గత రెండేళ్లుగా పూజా హెగ్డేకు వరుసల ఫ్లాపులు పలుకరించాయి. నాలుగు ఫ్లాపులు రావడంతో సక్సెస్ రేసులో వెనుకబడిపోయింది. అయితే పూజా హెగ్డే (Pooja Hegde)ని తీసుకోవాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు ఇప్పుడు శ్రీలీలను సెలక్ట్ చేసుకోవడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు.
శ్రీలీల ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు సరసన నటించింది. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు శ్రీలీలని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన “వినోదయ సీతమ్” రీమేక్‌లో ఒక ప్రత్యేక పాటలో కనిపించబోతోంది. దీనికి తోడు “ఉస్తాద్ భగత్ సింగ్”లో శ్రీలీల (Sreeleela) కాస్టింగ్‌ను దర్శకుడు హరీష్ శంకర్ పరిశీలిస్తున్నారు. గతంలో పూజా హెగ్డేని తీసుకున్నాడు. అయితే ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Dasara Third Song: ‘దసరా’ థర్డ్ సాంగ్ ‘చమ్కీల అంగీలేసి’ వచ్చేస్తోంది!