AMB In Bangalore : బెంగళూరులోనూ మహేష్ బాబు AMB సినిమాస్.. లాంఛ్ ఎప్పుడంటే ?
AMB In Bangalore : మహేష్ బాబు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ గురించి తెలియనిది ఎవరికి !!
- Author : Pasha
Date : 18-09-2023 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
AMB In Bangalore : మహేష్ బాబు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ గురించి తెలియనిది ఎవరికి !! AMB సినిమాస్ చాలా ఫేమస్.. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ బెంగళూరులో కూడా స్టార్ట్ కాబోతోంది. ఏషియన్ సినిమాస్ తో కలిసి బెంగళూరులో AMB సినిమాస్ ను మహేష్ బాబు త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు కూడా పూర్తి కావచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం మంచి లాభాలను గడిస్తున్న AMB సినిమాస్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు విస్తరించాలని మహేష్ బాబు యోచిస్తున్నారు. ఈక్రమంలోనే బెంగళూరులో కూడా AMB మల్టీప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు.
Also read : Santiniketan – UNESCO : యునెస్కో వారసత్వ సంపదగా ‘ఠాగూర్ శాంతినికేతన్’.. విశేషాలివీ
కర్ణాటకలోని అతిపెద్ద సినిమా థియేటర్ బెంగళూరు గాంధీనగర్ లో ఉన్న కపాలి థియేటర్. దాన్ని నిర్మించి 45 ఏళ్ళు అవుతోంది. 1968లో కపాలి సినిమా థియేటర్ ను నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రారంభించారు. తొలుత కపాలి థియేటర్ లో 1465 సీట్లు ఉండేవి. అయితే ఆ సీట్లను కాలక్రమంలో 1100 సీట్లకు తగ్గించారు. 2017లో ఈ థియేటర్ ని క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ఒక మాల్ లో.. మహేష్ బాబు తన AMB సినిమాస్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ‘త్వరలో ఇక్కడ AMB సినిమాస్ వస్తోంది’ అనే బోర్డును ఆ మాల్ నిర్మించే ప్లేస్ లో పెట్టారు. బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ లో 6 స్క్రీన్స్ ఉంటాయని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఈ మాల్ ప్రారంభమవుతుందని సమాచారం. మహేష్ బాబు (AMB In Bangalore) స్వయంగా దీన్ని స్టార్ట్ చేస్తారని అంటున్నారు.