Soniya Akula : పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ
Soniya Akula : తెలుగు బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా ఆకుల (Soniya Akula) సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ప్రియుడు యశ్ పాల్తో (Yash Veeragoni) నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.
- By Sudheer Published Date - 03:24 PM, Sat - 23 November 24

చిత్రసీమలో వరుసగా యంగ్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ మధ్య చాలామంది పెళ్లి చేసుకోగా..తాజాగా ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. తెలుగు బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా ఆకుల (Soniya Akula) సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ప్రియుడు యశ్ పాల్తో (Yash Veeragoni) నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. నవంబర్ 21 గురువారం నాడు వీరి వివాహ నిశ్చితార్థం బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. సోనియా విషయానికి వస్తే..బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టి , తన ఆట తీరుతో అందర్నీ మెప్పించి, అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయింది.
హౌస్ లో ఉన్నన్ని రోజులు ఫైర్ బ్రాండ్ గా పేరు దక్కించుకుంది. ఇకపోతే సోనియా హీరోయిన్ గా కూడా నటించింది.’జార్జి రెడ్డి’చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఈమె, ఆ సినిమాలో హీరో చెల్లి పాత్ర చేసింది. దర్శకుడు ఆర్జీవి ఈమెకు లీడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాలో కూడా ఈమె నటించింది. అంతేకాదు ‘కరోనా వైరస్’ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక సోషల్ వర్కర్ గా బాధ్యతలు నెరవేరుస్తున్న ఈమెకు యష్ పాల్ (Yash Paul)అనే వ్యక్తి పరిచయమయ్యారట. అమెరికాలో ఉండే ఈయన సోనియాతో కలిసి కొన్ని ప్రాజెక్టులలో కూడా పనిచేసినట్లు సమాచారం. పాల్ తో పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇక తమకంటే కూడా సోనియా పెళ్లి విషయంలో వారి పేరెంట్స్ మరో అడుగు ముందుకేసినట్లు సమాచారం. ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు యష్. ఇకపోతే సడన్గా నవంబర్ 21న ఇద్దరు నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ ఫొటోస్ చూసి పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనియా-యష్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
Read Also : Wayanad By Election : వయనాడ్‌లో ప్రియాంక గాంధీ వాద్రా జయభేరి