Amala Akkineni : అమల సినిమా చూసి అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయారు.. ఆ కథ తెలుసా?
మలయాళంలో అమల పరిచయం అవుతూ చేసిన 'ఎంటె సూర్యపుత్రిక్కు' (Ente Sooryaputhrikku) సినిమా చూసి కొందరు అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయి అమల వద్దకు వచ్చారని అప్పటిలో బాగా ప్రచారం జరిగింది.
- Author : News Desk
Date : 06-07-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
అమల అక్కినేని(Amala Akkineni) తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డుని అందుకున్న అమల.. 1986 – 1992 మధ్యకాలంలో కోలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్ గా కొనసాగారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాలు చేశారు. అయితే మలయాళంలో అమల పరిచయం అవుతూ చేసిన ‘ఎంటె సూర్యపుత్రిక్కు’ (Ente Sooryaputhrikku) సినిమా చూసి కొందరు అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయి అమల వద్దకు వచ్చారని అప్పటిలో బాగా ప్రచారం జరిగింది.
ఈ విషయంపై అమల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. అమల మాట్లాడుతూ.. 1991 లో వచ్చిన మలయాళ సినిమా ‘ఎంటె సూర్యపుత్రిక్కు’లో నాది రెబల్ క్యారెక్టర్. ఆ సినిమా చూసి కేరళకు చెందిన కొందరు అమ్మాయిలు చెన్నైలోని మా ఇంటికి వచ్చారు. కొంతమంది అయితే చెప్పకుండా వచ్చేశారు. నాకు మొదట భయమేసింది. ఆ సినిమాలో నా పాత్ర వాళ్లలో స్ఫూర్తిని నింపిందని చెప్పారు. దానికి నాకు సంతోషం అనిపించింది. ఆ తరువాత వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి పంపించేశాను అని తెలిపింది. ఈ సినిమాని ఫహద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాని మలయాళం, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. మలయాళంలో సురేష్ గోపి హీరోగా కనిపించగా, తమిళంలో రాజా హీరోగా నటించాడు.
ఇక అమల 1992 లో నాగార్జున(Nagarjuna)ని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత నుంచి ముఖ్య పాత్రల్లో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. ఇటీవల శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక జంతువులు పై ఎక్కువ ప్రేమ చూపించే అమల.. బ్లూ క్రాస్ (Blue Cross) పేరిట ఒక NGO స్టార్ట్ చేసి మూగజీవులను సంరక్షిస్తూ వస్తున్నారు.
Also Read : Hero Srivishnu: మెగాస్టార్ ఆటోగ్రాఫ్ తో నా జాతకం మారిపోయింది: హీరో శ్రీవిష్ణు