Naga Chaitanya – Shobitha : ఓహ్..శోభిత కు కూడా చైతు సెకండేనా..?
2019లో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారట .చాలా రోజులు తమ బంధాన్ని కొనసాగించారట. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం.
- By Sudheer Published Date - 02:35 PM, Fri - 9 August 24

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) – నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ల నిశ్చితార్థ వేడుక గురువారం నాగార్జున ఇంటి వద్ద ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాల సింపుల్ గా జరిగింది. నిశ్చితార్థ వేడుక ప్రకటన ఆలా బయటకు వచ్చిందో లేదో శోభిత ధూళిపాళ గురించి అరా తీయడం స్టార్ట్ చేసారు. ఆమె పుట్టుక దగ్గరి నుండి నిన్నటి నిశ్చితార్థ వేడుక వరకు ఆమె ఏంచేసింది..? ఎక్కడ చదివింది..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? సినీ కెరియర్ ఎలా జరిగింది..? చైతు కంటే ముందు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా..? ఇలా అన్ని అరా తీయడం మొదలుపెట్టారు. ఇందులో చాల విషయాలు బయటకు వస్తున్నాయి. శోభిత ధూళిపాళ కి కూడా చైతు సెకండ్ బాయ్ ఫ్రెండ్ అనే వార్త బయటకు వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక శోభిత విషయానికి వస్తే.. ఏపీలోని తెనాలిలో 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. పదహారేళ్లూ వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత.. వైజాగ్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబయి యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకుంది.
శోభిత ముందుగా ఒక మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టి… 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. “ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013” టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత ఇండియా తరపున “మిస్ ఎర్త్ 2013” పోటీల్లోనూ పాల్గొంది. కానీ అక్కడ టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు. ముందుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె..తెలుగు లో అడివి శేషుతో కలిసి గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించింది. ఇకపోతే ఈమె నాగచైతన్యను ప్రేమించక ముందే ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రా తో ఎఫైర్ నడిపింది. 2019లో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారట .చాలా రోజులు తమ బంధాన్ని కొనసాగించారట. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. శోభిత అక్కడ తన ప్రియుడి నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద కుటుంబానికి కోడలు కాబోతోందని తెలుస్తోంది. మరొకవైపు నాగచైతన్య మాజీ భార్య ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం వీరిద్దరి ఎంగేజ్మెంట్ పై స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అప్పుడు సమంతను తిట్టిన చాలామంది ఇప్పుడు ఆమెను పొగుడుతూ నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ పై రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Read Also : Alla Nani : వైసీపీకి షాక్.. ఆళ్ల నాని రాజీనామా