Priyanka Chopra Daughter: సో క్యూట్.. ముద్దుల కూతురి ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక!
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) గారాల బిడ్డను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు.
- Author : Balu J
Date : 31-01-2023 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) – హాలీవుడ్ సింగర్ నిక్ తమ గారాల బిడ్డను మొదటిసారి ప్రపంచానికి చూపించారు. ప్రియాంక తన కూతురు (Daughter) మాల్తి మరియెస్ ఫొటోలను మంగళవారం షేర్ చేసింది. ఈ నెల 15న మాల్తి మొదటి పుట్టిన రోజు జరిగింది. దాంతో ఏడాది తర్వాత ఫొటోలను విడుదల చేయడం విశేషం. హాలీవుడ్ (Hollywood) వాక్ ఆఫ్ ఫేమ్ జొనాస్ సోదరులకు సోమవారం స్టార్ అవార్డు ప్రదానం చేసింది. ఈ వేడుకలకు ప్రియాంక కూతురు మాల్తితో కలిసి హాజరైంది.
కూతురిని ఒడిలో కూర్చొబెట్టుకున్న ప్రియాంక (Priyanka Chopra) ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. తెల్లని దుస్తుల్లో చిన్నారి మాల్తి ఎంతో క్యూట్‌గా ఉంది. అమెరికా సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంకా చోప్రా 2018 డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. ది క్వింటకో షోతో పాపులర్ అయిన ప్రియాంకపై నిక్ మనసు పారేసుకున్నాడు. కొంతకాలం ప్రేమలో ఉన్న ఇద్దరూ వివాహం (Marriage) తో తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించారు. 2022 జనవరి 15న ఈ జంట తల్లిదండ్రులయ్యారు.
సరోగసీ ద్వారా బిడ్డను కన్నారు. ప్రియాంక (Priyanka Chopra), నిక్ ఇంతకుముందు సోషల్‌మీడియాలో తమ బిడ్డ ఫొటోలు చాలా పోస్ట్ చేశారు. కానీ, వాటిలో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. మాల్తి ముఖాన్ని తెల్లని హార్ట్ సింబల్‌తో కనిపించకుండా చేసేవారు. అయితే.. ఎట్టకేలకు ఈరోజు అభిమానులు, మీడియా కోసం మాల్తి ఫేస్‌ను అందరికీ చూపించారు. దాంతో ప్రియాంక ఫ్యాన్స్.. ‘బేబీ చాలా క్యూట్‌గా ఉంది’ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడతున్నారు.
Also Read: Dasara Teaser: నాని దసరా టీజర్ ను చూశారా!