HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Intense Teaser Of Natural Star Nani Srikanth Odela Slv Cinemas Dasara

Dasara Teaser: నాని దసరా టీజర్ ను చూశారా!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ చిత్రం కూడా యూనివర్సల్ అప్పీల్ వున్న చిత్రం.

  • By Balu J Published Date - 11:21 AM, Tue - 31 January 23
  • daily-hunt
Nani Dasara
Nani Dasara

యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు భాషా అడ్డంకులను బద్దలు కొడుతున్నాయి. కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా ఆల్-ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. సినిమా మరింత లొకలైజ్డ్, ఒరిజినల్, డీప్ రూటేడ్ గా వున్నట్లయితే అది మరింత యూనివర్సల్ అప్పీల్ ని కలిగివుంటుంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ చిత్రం కూడా యూనివర్సల్ అప్పీల్ వున్న చిత్రం. ఇప్పుడు విడుదలైన సినిమా టీజర్ కూడా అదే సూచిస్తుంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘దసరా’ ‘రా’, రస్టిక్, ఇంటెన్స్ టీజర్ ను లాంచ్ చేశారు.

చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగ దసరాను భారతదేశం అంతటా చాలా ఆనందం ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చూపించే సినిమా దసరా. టీజర్‌ను బట్టి చూస్తే కంటెంట్ ఒరిజినల్, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటీనటుల మేకోవర్‌లు, బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల ప్రపంచాన్ని చూపించడం, వారు అనుసరించే ఆచారాల వరకు.. దసరా టీజర్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మొదటి ఫ్రేమ్‌లో ధరణి (నాని) భారీ రావణుడి దిష్టిబొమ్మ ముందు నిలబడి ఉన్నట్లు ప్రజంట్ చేశారు. ‘’వీర్లపల్లి.. సుట్టూర బొగ్గు కుప్పలు.

తొంగి చూస్తే కానీ కనిపించని వూరు. మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సాంప్రదాయం’ అని నాని వాయిస్ తో టీజర్ మొదలైయింది. ధరణి ప్రపంచం చాలా వైల్డ్ ఉంది . కొన్ని దుష్టశక్తులు గ్రామంలో సామరస్యానికి భంగం కలిగించినప్పుడు అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని కలసి ఒక అద్భుతాని అందించారు. శ్రీకాంత్ ఓదెల పనితనం చూస్తే అతను ఒక కొత్త దర్శకుడని అనిపించడం లేదు. కథానాయకుడు, ప్రతినాయకుల వీరత్వాన్ని దృశ్య, సంగీత పరంగా అద్భుతంగా ప్రజంట్ చేశారు ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. నాని క్యారెక్టర్‌లోని కీలకమైన అంశాలను గ్రేట్ యీజ్ తో ప్రజంట్ చేశారు

టీజర్ లో నాని ర్యాంపేజ్ మనం చూస్తాం. అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ధరణి ట్రాన్స్‌లోకి కూడా తీసుకువెళతాయి. అతను బీడీ వెలిగించే విధానం, మద్యం సేవించిన తర్వాత అతను చేసే సంబరాలు జనాలకు గూస్‌బంప్స్‌ని ఇస్తాయి. చివరి ఎపిసోడ్‌లో నాని తన వేలు కత్తికి రాజుకుంటూ రక్తం నుదుటిపై పెట్టుకోవడం అతని తిరుగుబాటు వైఖరిని తెలియజేస్తుంది. షైన్ టామ్ చాకో, సాయి కుమార్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించారు. టీజర్‌లో కీర్తి సురేష్‌ కనిపించలేదు.

సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ మాస్టర్ వర్క్‌ కనబరిచారు. విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరో స్థాయికి ఎలివేట్ చేశాయి. ఎడిటర్ నవీన్ టీజర్ బ్రిలియంట్ గా వుంది. ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణ విలువలు టాప్-క్లాస్. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. టీజర్ దసరా పై అంచనాలని ఆకాశాన్ని అందుకునేల చేసింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ.. దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. మార్చి 30 న అందరూ దసరా గురించి మాట్లాడుకుంటారు. అది తప్పితే మరో టాపిక్ వుండదు. తెలుగు సినిమా గురించి నా కాంట్రిబ్యూషన్ ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. చాలా గర్వంగా ఒక మాట చెబుతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుండి బిగ్గెస్ట్ ట్రిబ్యూషన్.. శ్రీకాంత్ ఓదెల. అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. టీజర్ జస్ట్ సాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది.. నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. గత ఏడాది తెలుగు సినిమా నుండి ఆర్ఆర్ఆర్ వచ్చిన కన్నడ నుండి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. 2023లో తెలుగు సినిమా నుంచి వస్తుంది దసరా. సినిమా విడుదల తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మార్చి 30 థియేటర్ లో కలుద్దాం’’ అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dasara
  • hero nani
  • keerthy suresh
  • teaser out

Related News

Bathukamma

Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?

ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.

    Latest News

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd