Siva RajKumar Bhairati Ranagal : పుష్ప 2 తో పోటీకి సై అన్న స్టార్ హీరో..?
Siva RajKumar Bhairati Ranagal ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా కోసం నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
- By Ramesh Published Date - 01:11 PM, Mon - 20 May 24

Siva RajKumar Bhairati Ranagal ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా కోసం నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్ప రాజ్ మాస్ యాటిట్యూడ్ మరోసారి తెర మీద చూడాలని ఊగిపోతున్నారు. పుష్ప 2 అంచనాలను ఏమాత్రం తగ్గకూడదని ఫిక్స్ అయిన సుకుమార్ అందుకు తగినట్టుగానే సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
పుష్ప 2 సినిమా ఆగష్టు 15న సోలో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి ఆ సినిమాకు పోటీగా ఏది రావట్లేదు. అంత సాహసం ఎవరు చేయట్లేదు. హిందీలో కూడా అజయ్ దేవగన్ సింగం ఎగైన్ రిలీజ్ చేయాలని అనుకున్నా మళ్లీ డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఆగష్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 కి పోటీగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమా వస్తుందని తెలుస్తుంది.
కన్నడలో మఫ్తీతో సూపర్ హిట్ అందుకున్న నర్తన్, శివ రాజ్ కుమార్ కాంబోలో వస్తున్న సినిమా భైరతి రణగల్. ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టిన కాంబినేషన్ కాబట్టి ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. సినిమాను ఆగష్టు 15న పుష్ప 2 కి పోటీగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
కన్నడ నుంచి వస్తున్న మరో భారీ సినిమాగా భైరతి రణగల్ వస్తుంది. మరి పుష్ప 2 కి ఈ మూవీ ఏమేరకు పోటీ ఇస్తుంది అన్నది చూడాలి.
Also Read : Pooja Hegde : పూజా థై షో.. షేక్ చేస్తుంది అంతే..!