HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sitara Ghattamaneni Shines In Guntur Kaaram Mahesh Babu Out Fits

Sitara: గుంటూరు కారంలో మహేష్ బాబు వేసుకున్న షర్టుతో ఏఎంబి మాల్‌లో మెరిసిన సితార?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి మనందరికీ తెలిసిందే. సితార ఇంత చిన్న వయసులోనే హీరోయిన్ రేంజ్

  • Author : Anshu Date : 02-02-2024 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 02 Feb 2024 08 13 Am 1430
Mixcollage 02 Feb 2024 08 13 Am 1430

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి మనందరికీ తెలిసిందే. సితార ఇంత చిన్న వయసులోనే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది. ఒకవైపు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది సితార. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కలర్ ఫుల్ ఫొటోస్ డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

తండ్రి మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సితార. ఇటీవలే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఒక పాటకు స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూతుళ్లు, సితార మంచి ఫ్రెండ్స్. డాన్స్ వీడియోలతో పాటు అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి థియేటర్స్, షాపింగ్స్ అంటూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఆ ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి సితార ఏఎంబి మాల్‌లో కనిపించింది.

 

#Sitara be like: This one’s for your Nanna❤️❤️❤️#MaheshBabu | #GunturKaaram pic.twitter.com/YmWbjUF0tk

— VardhanDHFM (@_VardhanDHFM_) February 1, 2024

ఫ్రెండ్స్ తో కలిసి మరోసారి గుంటూరు కారం సినిమా చూసి ఎంజాయ్ చేసింది. ఇక ఈ సినిమా చూడడానికి సితార.. గుంటూరు కారం అవుట్ ఫిట్స్ తో కనిపించింది. గుంటూరు కారం సినిమాలో హీరో మహేష్ బాబు ధరించిన రెడ్ షర్ట్ ని వేసుకొని సితార ఏఎంబీ మాల్ లో సందడి చేసింది. కుర్చీని మడత పెట్టే అనే సాంగ్ లో మహేష్ బాబు ధరించిన షర్టును వేసుకొని కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ ని చూసిన మహేష్ బాబు సితార అభిమానులు వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Guntur Kaaram
  • mahesh babu
  • mahesh babu out fits
  • sitara
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd