HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Singer Kalpana Suicide Attempts

Singer Kalpana : సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం

Singer Kalpana : వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

  • Author : Sudheer Date : 04-03-2025 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Singer Kalpana Suicide Atte
Singer Kalpana Suicide Atte

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన గాత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నం (Suicide attempts) చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న కల్పన, తాజాగా నిద్ర మాత్రలు(Sleeping Pills) మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్స్ తెలిపారు.

ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటి?

కల్పన ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలా? లేక కెరీర్ ఒత్తిళ్లా? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాధానం లేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

సింగర్ కల్పన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అనేక హిట్ పాటలు పాడారు. చిన్నతనం నుంచే సంగీతాన్ని ప్రేమించిన ఆమె, టాలీవుడ్‌లో తన గాత్ర మాధుర్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాడిన పాటలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కాలంతో పాటు మారుతున్న సంగీత ప్రపంచంలో ఆమెను కొత్త సవాళ్లు ఎదుర్కొనేలా చేశాయి.

కల్పన ఆత్మహత్య కు ట్రై చేసిందనే వార్త తెలిసి సినీ ప్రముఖులు , అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సెలబ్రిటీల జీవితాల్లో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యక్తిగత జీవితానికి ప్రభావం చూపడం సాధారణంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kalpana Sleeping Pills
  • kalpana suicide
  • Singer Kalpana
  • Singer Kalpana News
  • singer kalpana suicide attempts
  • singer kalpana suicide News
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

    • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

    • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd