Silk Smitha : ‘సిల్క్ స్మిత’పై మరో బయోపిక్.. ఈసారి సిల్క్ పాత్రలో చేసేది ఎవరో తెలుసా?
మళ్ళీ ఇన్నాళ్లకు సిల్క్ స్మితపై మరో బయోపిక్ రానుంది.
- By News Desk Published Date - 10:57 AM, Mon - 2 December 24

Silk Smitha : తన అందాలతో, స్పెషల్ సాంగ్స్ తో, తన నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించింది దివంగత నటి సిల్క్ స్మిత. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా మారి అప్పట్లో చిన్న పెద్ద తేడా లేకుండా అబ్బాయిలందర్నీ తన వైపు తిప్పుకుంది సిల్క్ స్మిత. కష్టాలనుంచి మొదలైన ఆమె జీవితం సినిమాల్లో బాగా ఎదిగి స్టార్ గా మారి అనుకోకుండా విషాదంతో ముగిసింది.
ఇప్పటికే సిల్క్ స్మిత జీవిత కథతో విద్యాబాలన్ మెయిన్ లీడ్ లో డర్టీ పిక్చర్ సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. ఈ సినిమా 2011లో వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు సిల్క్ స్మితపై మరో బయోపిక్ రానుంది. నేడు సిల్క్ స్మిత పుట్టిన రోజు కావడంతో ఆమె జీవిత కథతో తెరకెక్కిస్తున్న బయోపిక్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ‘సిల్క్ స్మిత – క్వీన్ ఆఫ్ సౌత్’ అనే పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో చంద్రిక రవి నటిస్తుంది.
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి ఇప్పటికే తమిళ్, తెలుగులో పలు సినిమాల్లో నటించింది. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో ఐటెం సాంగ్ చేసింది ఈ భామ. ఇప్పుడు సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో.. ఇందిరాగాంధీ అన్ని పేపర్స్ లో సిల్క్ స్మిత గురించి చూసి ఎవరు అని అడుగుతుంది. అలాగే సిల్క్ స్మిత నడుస్తుంటే చిన్నా – పెద్ద మగవాళ్ళంతా ఆమెనే చూస్తున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది. మీరు కూడా సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ చూసేయండి..