Tillu Square Trailer Talk : టిల్లు స్క్వేర్ ట్రైలర్ టాక్.. నేను కారణ జన్ముడిని అంటున్న టిల్లు.. డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా..!
Tillu Square Trailer Talk సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో తెరకెక్కిన డీజే టిల్లు సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్న
- Author : Ramesh
Date : 14-02-2024 - 6:31 IST
Published By : Hashtagu Telugu Desk
Tillu Square Trailer Talk సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో తెరకెక్కిన డీజే టిల్లు సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 29న రిలీజ్ లాక్ చేశారు.
ఇక రిలీజ్ నెల రోజులు ఉన్నా కూడా సినిమా పై బజ్ పెంచేందుకు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. టిల్లు స్క్వేర్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ ఉంది. టిల్లు అనేటోడు మామూలు హ్యూమన్ బీయింగ్ కాదు కారణజన్ముడిని అంటున్నాడు.
ఊళ్లో జరిగే పంచాయితీలన్నీ తన నెత్తిన వేసుకునే వాడన్నమాట. ఇక సినిమా ట్రైలర్ లో అనుపమ గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. యూత్ ఆడియన్స్ కు కావాల్సిన అంశాలతో పాటు టిల్లు మార్క్ కామెడీ ఈ సినిమా పై అంచనాలు డబుల్ అయ్యేలా చేసింది. టిల్లు స్క్వేర్ టార్గెట్ అస్సలు మిస్ అయ్యేలా లేదని ట్రైలర్ చూసి చెప్పొచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నాడు. టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.