Siddhu Jonnalagadda Tillu Cube Heroine Chance for Priyanka Jawalkar : టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్..?
టిల్లు క్యూబ్ లో కూడా అటు నటనలోనూ ఇటు గ్లామర్ లోనూ రెండిటిలో అదరగొట్టేలా తెలుగు అమ్మయిని తీసుకుంటున్నారట.
- By Ramesh Published Date - 06:43 AM, Tue - 9 July 24

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ (Tillu Square) రెండు సూపర్ హిట్ అయ్యాయి. టిల్లు స్క్వేర్ సినిమా అయితే అంచనాలకు మించి 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీటింగ్ లోనే టిల్లు క్యూబ్ అనౌన్స్ చేశాడు సిద్ధు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ జాక్ ఇంకా తెలుసు కదా సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేశాక టిల్లు క్యూబ్ పనుల్లో బిజీ అవుతాడు.
డీజే టిల్లులో నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటించింది. టిల్లు ని చీట్ చేసే పాత్రకు రాధిక అదే నేహా శెట్టి పూర్తి న్యాయం చేసింది. టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా తన గ్లామర్ తో మెప్పించింది. ఐతే టిల్లు క్యూబ్ లో కూడా అటు నటనలోనూ ఇటు గ్లామర్ లోనూ రెండిటిలో అదరగొట్టేలా తెలుగు అమ్మయిని తీసుకుంటున్నారట. ఇంతకీ టిల్లు క్యూబ్ లో హీరోయిన్ ఎవరు అంటే టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవల్కర్ (Priyanka Jawalkar ) అని అంటున్నారు.
కెరీర్ పెద్దగా జోష్ లేని ప్రియాంక ఈమధ్య ఒక్క ఛాన్స్ కూడా అందుకున్న పరిస్థితి లేదు. ఐతే టిల్లు క్యూబ్ లో ఆమెను తీసుకుంటున్నారని తెలిసి అమ్మడి ఫాలోవర్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు అమ్మాయిగా కెరీర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియాంకకు ఎందుకో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. డీజే టిల్లు (DJ Tillu), టిల్లు స్క్వేర్ లాంటి క్రేజీ సినిమా సీక్వెల్ లో ఛాన్స్ అందుకుంది అంటే కచ్చితంగా ప్రియాంకకు ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ప్రియాంక జవల్కర్ కూడా టిల్లు క్యూబ్ లో ఎట్రాక్షన్ గా మారాలని అనుకుంటుంది. మల్లిక్ రాం టిల్లు స్క్వేర్ డైరెక్ట్ చేయగా టిల్లు క్యూబ్ కి అతన్ని మార్చి వేరే డైరెక్టర్ డైరెక్షన్ చేస్తారని తెలుస్తుంది.