Shruthi Hassan: హార్మోన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న.. శృతి హాసన్!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
- Author : Anshu
Date : 01-07-2022 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
Shruthi Hassan: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఖాళీ టైంలో సోషల్ మీడియాలో కూడా సమయాన్ని గడుపుతుంది. నిత్యం ఏదో ఒక విషయం పంచుకుంటూనే ఉంటుంది.
అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. ఇక తాజాగా తన ఇన్ స్టాలో తను వర్కౌట్ చేస్తున్న వీడియో షేర్ చేసుకుంది. అందులో కొన్ని విషయాలు పంచుకుంది. తను శారీరకంగా చాలా వీక్ గా ఉన్నాను అంటూ.. మానసిక మాత్రం దృఢంగా ఉన్నాను అని తెలిపింది. ఇక తను పలు హార్మోన్ల సమస్యతో బాధపడుతున్నాను అని.. ప్రస్తుతం తను కొని చెత్త హార్మోన్ల సమస్యలు ఎదుర్కొంటున్నాను అని తెలిపింది.
వీటి కోసం బయటపడేందుకు పోరాటం చేస్తున్నాను అని.. ఇందుకోసం సరైన తిండి, నిద్ర వ్యాయామం చేస్తున్నాను అని తెలిపింది. ఇటువంటి సమస్యల గురించి బయట చెప్పేందుకు చాలామంది సంకోచిస్తుంటారని కానీ ఇలాంటి సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి అని.. ఎందుకంటే ఇవి మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు అంటూ.. అందుకే ఈ విషయాన్ని పంచుకోవాలనుకున్నాను అని తెలిపింది.