Samantha : సమంత ప్లేస్ లో శృతి హాసన్.. మళ్లీ ఫాం లోకి వస్తున్న అమ్మడు..!
సౌత్ స్టార్ హీరోయింగా ఒక వెలుగు వెలిగిన సమంత (Samantha) పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ వల్ల కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. తిరిగి మళ్లీ సినిమాలు చేద్దాం అనుకునేలోగా అమ్మడికి మయోసైటిస్
- Author : Ramesh
Date : 25-01-2024 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
సౌత్ స్టార్ హీరోయింగా ఒక వెలుగు వెలిగిన సమంత (Samantha) పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ వల్ల కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. తిరిగి మళ్లీ సినిమాలు చేద్దాం అనుకునేలోగా అమ్మడికి మయోసైటిస్ రావడంతో మళ్లీ వెనకపడింది. యశోద, శాకుంతలం చేసిన సమంత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో చేసిన ఖుషిని పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఆల్రెడీ సమంతతో సినిమా చేయాలని అనుకున్న మేకర్స్ కి ఆమె నిర్ణయం షాక్ ఇచ్చింది.
We’re now on WhatsApp : Click to Join
సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకోవడం తప్ప వారు చేసేది ఏమి లేదని అర్ధమైంది. లేటెస్ట్ గా సమంత చేయాల్సిన ఒక సినిమాను శృతి హాసన్ (Shruthi Hassan) చేజిక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఫిలిప్ జాన్ డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా చెన్నై స్టోరీ (Chennai Story) సినిమా చేయాలని అనుకున్నారు. ఈ సినిమాలో సమంత లేడీ డిటెక్టివ్ రోల్ పోషిస్తుందని మీడియాలో వైరల్ అయ్యింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నారు.
అయితే ఈ సినిమాలో ఇప్పుడు సమంత బదులుగా శృతి హాసన్ వచ్చి చేరిందని తెలుస్తుంది. కొన్నాళ్లు కెరీర్ పరంగా వెనకబడిన శృతి హాసన్ మళ్లీ ఇప్పుడు తిరిగి ఫాం లోకి వచ్చింది. ఆమె చేస్తున్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.
లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చేసిన శృతి హాసన్ ఇయర్ ఎండింగ్ లో సలార్ తో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు సమంత ప్లేస్ లో ఆమె ఎంపికైంది. రాబోతున్న ఈ సినిమాతో శృతి హాసన్ ఆడియన్స్ ని ఆకట్టుకోనుంది.