Shruthi Hassan : డైరెక్టర్ తో రొమాన్స్ కోసం హీరోయిన్ బలవంతం..!
Shruthi Hassan కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ గా ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడు. కమల్ హాసన్ నిర్మాణంలో శృతి హాసన్ కాన్సెప్ట్ అండ్ కంపోజింగ్ లో వస్తున్న స్పెషల్ వీడియో ఇనిమేల్.
- Author : Ramesh
Date : 24-03-2024 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
Shruthi Hassan కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ గా ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడు. కమల్ హాసన్ నిర్మాణంలో శృతి హాసన్ కాన్సెప్ట్ అండ్ కంపోజింగ్ లో వస్తున్న స్పెషల్ వీడియో ఇనిమేల్. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ స్పెషల్ వీడియో ద్వర్కేష్ ప్రభాకర్ డైరెక్ట్ చేశారు. ఈ వీడియో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేయగా మార్చి 25న ఈ వీడియో రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ గా లోకేష్ తన స్టామినా చూపిస్తుండగా నటుడిగా తన తొలి ప్రయత్నమే ఇదని చెప్పొచ్చు.
అయితే ఇనిమెల్ వీడియోలో నటించనని లోకేష్ చెప్పేశాడట. కానీ శృతి హాసన్ పట్టుబట్టి అతన్ని మెప్పించిందట. అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా శృతి హాసన్ కావాలని అతన్ని బలవంత పెట్టి లోకేష్ ని ఒప్పించిందట. ఖైదీ, విక్రం సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ లాస్ట్ ఇయర్ విజయ్ తో లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
శృతి హాసన్ తో ఇనిమేల్ లో నటించిన లోకేష్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం శృతి హాసన్ పక్కన అతను ఏంటి విడ్డూరంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా కామెంట్స్ వస్తాయనే లోకేష్ తాను నటించనని అన్నాడు కానీ శృతి హాసన్ బలవంతం చేసి మరీ అతన్ని ఒప్పించిందని తెలుస్తుంది. మరి ఇనిమేల్ ఎలా ఉండబోతుందో చూడాలి.
#Inimel the game begins from 25th March.
Mark the Moment!
Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq— Raaj Kamal Films International (@RKFI) March 21, 2024