Shilpa Shetty- Raj Kundra Divorce : రాజ్ కుంద్రా- శిల్పాశెట్టి లు విడాకులు తీసుకున్నారా..?
స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది
- Author : Sudheer
Date : 20-10-2023 - 12:09 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రసీమ (Cine Industry)లో ప్రేమ (Love) , పెళ్లి (Marriage) , విడాకులు (Divorce ) చాల కామన్..ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా విడాకులు తీసుకొని వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటివరకు బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీ లలో పలువురు సినీ తారలు ఇలా విడాకులు తీసుకోగా..తాజాగా మరో జంట విడాకులు తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా రాజ్ కుంద్రా (Raj Kundra Twitter) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
రాజ్ కుంద్రా తన ట్విట్టర్ లో శిల్పా (Shilpa Shetty) గురించి ప్రస్తావించకుండా.. ‘మేము విడిపోయాము. ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము’ అంటూ రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరి నిజంగానే విడిపోయారా ? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
మరికొందరు మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ విడాకుల గురించి కాదని.. ఇన్నాళ్లు తనతో ఉన్న మాస్క్ గురించి చెప్పాడని..ఇకపై మాస్క్ ఉపయోగించనని ఇలా ట్వీట్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు శిల్పా శెట్టి సోషల్ మీడియా ఖాతాలలో విడాకులకు సంబంధించిన ఎలాంటి పోస్టులు కనిపించడం లేదు. అంతేకాదు.. ఆమె గురువారం తన భర్త కొత్త సినిమా UT69 పోస్ట్ చేస్తూ… రాజ్ కుంద్రాకు బెస్ట్ విషెస్ తెలిపింది. మరి రాజ్ ట్వీట్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి..? అనేది ఆయనే చెప్పాలి.
Read Also : Gill-Sara Tendulkar: గిల్ బ్యాటింగ్ గిలిగింతలకు సారా టెండూల్కర్ క్లీన్ బోల్డ్, నవ్వులు, చప్పట్లతో ఎంకరేజ్