Sharukh Khan: ఆర్యన్ ఖాన్ తెరంగేట్రానికి రంగం సిద్దం..!
బాలీవుడ్ బడా హీరో షారూక్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది.
- Author : Maheswara Rao Nadella
Date : 07-12-2022 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ బడా హీరో షారూక్ ఖాన్ (Sharukh Khan) వారసుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆర్యన్ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కానీ, ఆర్యన్ తెరంగేట్రం చేయబోతోంది హీరోగా కాదు దర్శకుడిగా. సొంతగా కథ రాసుకొని ఆర్యన్ (Aryan Khan) దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని ఆర్యన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన తొలి ప్రాజెక్టు కోసం ఆర్యన్ స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేశాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఓ ఫీచర్ ఫిల్మ్ కోసం ఆర్యన్ (Aryan Khan) ఈ కథ రాసినట్టు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు ఓ వెబ్ సిరీస్ అని సమాచారం. ఆర్యన్ దర్శకుడిగా, షో రన్నర్ గా వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నాడు. షారూక్ ఖాన్ (Sharukh Khan) సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంతో కలిసి అమెజాన్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనుంది. వచ్చే ఏడాది ఈ సిరీస్ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. తన కుమారుడు ఆర్యన్ స్ర్కిప్ట్ పూర్తి చేశాడని, దాన్ని చూసేందుకు వేచి చూస్తున్నా అని గౌరీ ఖాన్ పేర్కొన్నారు.
Also Read: Repo Rate: రెపో రేటు మారియో 35 బేసిస్ పాయింట్లు పెంపు..