Sharma and Ambani : ఈ విన్ యాప్‌లో మరో సినిమా.. ‘శర్మ అండ్ అంబానీ’.. స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే..?
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శర్మ అండ్ అంబానీ ఈ విన్ లో స్ట్రీమింగ్ రెడీ అవుతుంది. ఎప్పుడంటే..?
- By News Desk Published Date - 08:08 PM, Sun - 7 April 24

Sharma and Ambani : ఇటీవల ఈ విన్(E Win) యాప్ లో మంచి మంచి సిరీస్ లు, సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ విన్ లో మరో కొత్త సినిమా రాబోతుంది. క్రైం కామెడీ జానర్ లో ‘శర్మ & అంబానీ’ అనే సినిమా ఈ విన్ లో రిలీజ్ కాబోతుంది. భరత్, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. అనిల్ పల్లా, భరత్ తిప్పిరెడ్డి నిర్మాణంలో కార్తీక్ సాయి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.
ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ట్రైలర్ లో చూపించిన కథ ఏంటంటే.. శర్మ ఓ ఆయుర్వేద మూలికలు అమ్ముకుంటూ ఉంటాడు. అంబానీ షూ పాలిష్, చెప్పులు కుట్టుకుంటూ బతుకుతాడు. ఇలాంటి ఈ ఇద్దరు కలవడం, ఒక గ్యాంగ్ లో డైమండ్స్ మిస్ అవ్వడం, అవి వీరి చేతికి చిక్కడం.. ఇలాంటి క్రైం కామెడీ కథతో సినిమా ఉండబోతున్నట్టు చూపించారు.
Also Read : Premalu Telugu OTT : ప్రేమలు OTT తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా..!
ఇక ఈ శర్మ & అంబానీ సినిమా ఏప్రిల్ 11 నుంచి ఈ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి మనమే రాజా.. అంటూ సాగే ఓ పాట కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన అందుకుంది. ఇటీవల వరుసగా పలు సిరీస్, సినిమాలతో మెప్పిస్తున్న ఈ విన్ యాప్ మరి ఈ సినిమాతో ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.