Shahrukh and Ram Charan: రామ్ చరణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్.. ఎందుకో తెలుసా!
షారూఖ్ ఖాన్ తన సోషల్ మీడియా మాధ్యమంలో #AskSRK సెషనల్‌లో పాల్గొన్నారు.
- Author : Balu J
Date : 23-01-2023 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) ‘పఠాన్’ చిత్రం జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధమైంది. దీపికా పదుకొనె, జాన్ అబ్రహం కూడా ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం పఠాన్ ప్రమోషనల్ కార్యక్రమాలతో చిత్ర యూనిట్ బిజీగా ఈ క్రమంలో షారూఖ్ ఖాన్ తన సోషల్ మీడియా మాధ్యమంలో #AskSRK సెషనల్‌లో పాల్గొన్నారు. ఇందులో తన ఫ్యాన్స్, నెటిజన్స్‌ను ఆయన ప్రశ్నలు వేయమన్నారు. అందులో ఆయన కొన్ని ఫన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అలాంటి ప్రశ్నల్లో ఓ ప్రశ్న దానికి షారూఖ్ ఖాన్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఓ అభిమాని షారూఖ్‌తో ‘‘హాయ్ సర్, మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మూవీ థియేటర్స్‌కి వస్తారా?’ అని ప్రశ్నించాడు. దానికి షారూఖ్ ఖాన్ సమాధానం చెబుతూ ‘తప్పకుండా.. అయితే నన్ను రామ్ చరణ్ (Ram Charan) తీసుకెళితేనే వస్తాను’ అన్నారు. షారూఖ్ ఇచ్చిన సమాధానం.. అందులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన ప్రస్తావించటం అందరినీ ఆకట్టుకుంది.
ఇద్దరు సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్, రామ్ చరణ్ (Ram Charan) ఇలా వారి అభిమానులను సర్‌ప్రైజ్ చేయటం ఇదేమీ కొత్త కాదు. జనవరి 10న పఠాన్ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రామ్ చరణ్ (Ram Charan) తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. అప్పుడు షారూక్ స్పందించిన సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా ఆయన రామ్ చరణ్ గురించి ప్రస్తావించటం ఇంటర్నెట్‌లో వైరల్ (Viral) అవుతుంది.
Also Read: Tulasi Benefits: చలికాలంలో తులసి ఆకులు తింటే ఏం జరుగుతుందో తెలుసా?