Jawan Teaser : జవాన్ టీజర్ చూశారా? అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు.. షారుఖ్ మరో భారీ హిట్ ఖాయం..
తాజాగా జవాన్ టీజర్(Jawan Teaser) రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
- By News Desk Published Date - 07:10 PM, Mon - 10 July 23

తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో బాలీవుడ్(Bollywood) బాద్‌షా షారుఖ్(Shahrukh Khan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుఖ్ సొంత నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా జవాన్ టీజర్(Jawan Teaser) రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. చాలా పవర్ ఫుల్ గా ఈ టీజర్ ఉంది. షారుఖ్ ఆర్మ్ ఆఫీసర్ గా, అలాగే అమ్మాయిలతో పోరాటాలు చేయిస్తూ కనపడ్డాడు. విజయ్ సేతుపతిని కూడా చాలా పవర్ ఫుల్ గా చూపించారు. టీజర్ అయితే చాలా ఆసక్తిగా సాగింది. టీజర్ లో కొన్ని సర్‌ప్రైజ్ లు ఇచ్చి అభిమానులని, ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు. ఈ టీజర్ లో దీపికా పదుకొనే ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. టీజర్ చివర్లో షారుఖ్ గుండుతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతే కాక సంజయ్ దత్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని, తలపతి విజయ్ కూడా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఉండొచ్చని సమాచారం.
Main kaun hoon, kaun nahin, jaanne ke liye, READY AH?
#JawanPrevue Out Now!
#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. https://t.co/6uL1EsSpBw— Shah Rukh Khan (@iamsrk) July 10, 2023
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. జవాన్ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. పఠాన్ తర్వాత ఈ సినిమాతో కూడా షారుఖ్ సూపర్ హిట్ కొడతాడని అంతా భావిస్తున్నారు.