Aryan Khan: లారిసా బొనేసి.. ఆర్యన్ ఖాన్ బ్రెజీలియన్ గర్ల్ ఫ్రెండ్.. ఎవరామె ?
- Author : Sailaja Reddy
Date : 03-04-2024 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఒక సారి డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్ ఖాన్ పేరు బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో మారుమోగిన విషయం తెలిసిందే. దాంతో కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ డేటింగ్ వార్తల విషయంలో అనేకసార్లు వార్తల్లో నిలిచారు ఆర్యన్. ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి ఆర్యన్ ఖాన్ పేరు మారుమోగుతోంది. బ్రెజిల్ మోడల్, నటితో ఆర్యన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అంటూ ముంబైలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తిక్క సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో లారిస్సా బొనెసి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈమెతో ఆర్యన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నాడు అంటూ ప్రస్తుతం వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఓన్లీ ఒట్టి వార్తలు మాత్రమే కాదండోయ్ ఒక నెటిజన్ ప్రూఫ్స్ కూడా చూపించాడు. నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనెసి ఒకరిని మరొకరు ఫాలో అవుతున్నారు. అందులో తప్పు ఏముందని అంటారా? లారిస్సా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లను కూడా ఆర్యన్ ఫాలో అవుతున్నారు.
Also Read: Mrunal Thakur: ప్రేక్షకులకు పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్.. వీడియో వైరల్!