Manchu Nirmala Devi : మంచు మనోజ్ తల్లి సంచలన లేఖ
Manchu Nirmala Devi : రెండు రోజుల క్రితం జనరేటర్లో చక్కెర పోశారని మనోజ్ చేసిన ఫిర్యాదులో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ విషయాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు లేఖలో తెలియజేశారు.
- By Sudheer Published Date - 01:40 PM, Tue - 17 December 24

మంచు ఫ్యామిలీ గొడవలు (Manchu Family Issue) ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు ఒకరు కాకపోతే ఒకరు ఏదోక సంచలనం రేపుతూ వార్తల్లో హైలైట్ చేస్తున్నారు. నిన్నంతా విష్ణు (Vishnu) తన గ్యాంగ్ తో వచ్చి జనరేటర్ లో చక్కర పోసి పెను ప్రమాదం సృష్టించాలని చూశాడని చెప్పి మనోజ్ (Manoj) పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరు మాట్లాడుకునేలా చేసింది.
తన తల్లి బర్త్ డేను అడ్డం పెట్టుకొని నా ఇంట్లోకి వచ్చిన విష్ణు జనరేటర్ లో డీజిల్ లో చక్కెరను కలిపి పోశాడని మనోజ్ ఆరోపించారు. జనరేటర్లో చక్కెర పోస్తుండటం చూసిన వారిని విష్ణు బెదిరించారన్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారన్నారు. జనరేటర్లో చక్కెర పోసి విద్యుత్తూ ఘాతానికి ప్లాన్ చేసాడని , తన కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేసేందుకు విష్ణు తన అనుచరులతో కలిసి పథకం పన్నారని మనోజ్ కంప్లయింట్ చేశారు.
ఈ ఆరోపణలను తల్లి నిర్మల (Mohanbabu wife Nirmala ) ఖండించింది.రెండు రోజుల క్రితం జనరేటర్లో చక్కెర పోశారని మనోజ్ చేసిన ఫిర్యాదులో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ విషయాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు లేఖలో తెలియజేశారు. విష్ణు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ‘నా పుట్టిన రోజు కావడంతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసి విష్ణు వెళ్లిపోయారు’ అని పేర్కొన్నారు. అంతకు మించి ఏమీ జరగలేదన్నారు. మరి నిర్మల చెప్పింది నిజామా..? లేక మనోజ్ చెప్పింది నిజమా..? అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది.
Read Also : One Nation One Election : లోక్‌సభ ఎదుటకు జమిలి ఎన్నికల బిల్లులు.. కేంద్రంపై విపక్షాలు ఫైర్