Sarath Babu: ఆ వార్తలు నిజం కాదు.. శరత్ బాబుకి చికిత్స కొనసాగుతుంది: శరత్ బాబు సోదరి
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది.
- Author : Gopichand
Date : 04-05-2023 - 6:55 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఓ ప్రముఖ నటి కూడా తన ట్విట్టర్ పేజీలో సంతాప సందేశాన్ని పేర్కొంది. కానీ శరత్ బాబు సోదరి అతను క్షేమంగా ఉన్నాడని, ఇప్పుడు సాధారణ గదికి మార్చబడ్డాడని పేర్కొంటూ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ పోస్ట్ లో ఆమె ఈ విధంగా పేర్కొంది. శరత్ బాబు హెల్త్ పై ఆయన సోదరి ఇచ్చిన సమాచారం ఈ విధంగా ఉంది. సోషల్ మీడియాలో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి. శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యి, రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి అని ఆమె పేర్కొన్నారు.
Also Read: Malli Pelli : నరేష్ జీవిత గాధ.. ‘మళ్ళీ పెళ్లి’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
బుధవారం ఆయన మృతి చెందారంటూ పలు పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం, సోషల్ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టడం అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది. ప్రముఖ నటుడు శరత్ బాబు మొదట చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ AIG ఆసుపత్రికి తరలించారు. శరత్‌బాబు కోలుకున్న తర్వాత మీడియాతో మాట్లాడతారని ఆయన సోదరి కూడా స్పష్టం చేసింది. శరత్ బాబుకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.