Malli Pelli : నరేష్ జీవిత గాధ.. ‘మళ్ళీ పెళ్లి’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
నరేష్ -పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో నరేష్ సొంత నిర్మాణంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
- By News Desk Published Date - 10:15 PM, Wed - 3 May 23

టాలీవుడ్(Tollywood) లో గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్(Naresh) – పవిత్ర(Pavithra) వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో తిరుగుతుండటంతో ఈ జంట బాగా వైరల్ అయ్యారు. నరేష్ – పవిత్ర కొన్నాళ్ల క్రితం లిప్ కిస్ ఇచ్చుకున్న వీడియోని రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీడియో, ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి చివరకు ఇదంతా o సినిమా కోసం అని చెప్పారు.
నరేష్ -పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో నరేష్ సొంత నిర్మాణంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే నరేష్ – పవిత్ర రియల్ లైఫ్ లో జరిగిందే సినిమా తీస్తున్నారు. టీజర్ లో.. నరేష్, పవిత్ర హోటల్ లో ఉంటే మూడో భార్య అక్కడికి రావడం, మూడో భార్య మీడియా ముందుకు వెళ్లడం, నరేష్ – పవిత్ర ఎంజాయ్ చేయడం చూపించారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే నరేష్ – పవిత్ర రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
Life Goes in a Full Circle 💞#MalliPelli Releasing in Worldwide Theaters On May 26th ❤️🔥
Lets Start the Celebrations with some crazy updates!🕺
❤️ #MalliPelliOnMay26 ❤️#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1@sureshbobbili9 @ArulDevofficial @VKMovies_ pic.twitter.com/60mBKqEBCa
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 3, 2023
ఇక ఈ మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. మరి ఈ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయి ఏ మేరకు ప్రేక్షకులని రప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాని తెలుగు, కన్నడలో రిలీజ్ చేయనున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో నరేష్ – పవిత్ర వైరల్ అవుతున్నారు.
Also Read : Vikram : విక్రమ్ కు పెద్ద ప్రమాదం.. విరిగిన పక్కటెముక.. హాస్పిటల్లో విక్రమ్..