Sarath Babu: నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమం
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. శరీరం అంతా విషతుల్యం అవ్వడంతో దాని ప్రభావం ఇతర భాగాలపై పడింది
- Author : Praveen Aluthuru
Date : 23-04-2023 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
Sarath Babu: నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. శరీరం అంతా విషతుల్యం అవ్వడంతో దాని ప్రభావం ఇతర భాగాలపై పడింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు.
నటుడిగా విలక్షణ పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శరత్ బాబు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. గత కొద్దిరోజులుగా శరత్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముందుగా బెంగుళూర్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందించగా ఫలితంగా లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా అయన ఏఐజీలోనే చికిత్స పొందుతున్నారు. కాగా రోజురోజుకి ఆయన శరీరం విషతుల్యం అవుతున్నట్టు సమాచారం. ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరి తిత్తులు, కాలేయం.. ఇతర అవయవాలపై పడటంతో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. మళ్ళీ తెరపై కనిపించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా శరత్ బాబు 200 కు పైగా సినిమాల్లో నటించారు. 1973 లో సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. హీరోగా, విలన్, తండ్రి, స్నేహితుడి పాత్రలలో నటించి మెప్పించారు.
Read More: Viral Video: పొలంలో హార్వెస్టర్ యంత్రంపై మొసలి దాడి.. వైరల్ అవుతున్న వీడియో..!