Sandeep Vanga: 36 ఎకరాల భూమిని అమ్ముకున్న యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్..!?
సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ఇప్పుడు ఈ పేరు సినిమాల్లో ఒక సరికొత్త బ్రాండ్. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
- Author : Gopichand
Date : 08-12-2023 - 3:44 IST
Published By : Hashtagu Telugu Desk
Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ఇప్పుడు ఈ పేరు సినిమాల్లో ఒక సరికొత్త బ్రాండ్. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తెలుగు డైరెక్టర్ అయి ఉండి బాలీవుడ్‌లో జెండా ఎగరేస్తున్న దర్శకుడు. ఆయన రూపొందించిన `యానిమల్` సినిమా ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.
సందీప్ రెడ్డి నేషనల్ వైడ్‌గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. సందీప్ గురించి ఆరా తీసే పనిలో అభిమానులు ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూలు, బ్యాక్ గ్రౌండ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే సందీప్ రెడ్డి చేసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మెడికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన సందీప్ డైరెక్షన్‌పై ఆసక్తితో డాక్టర్ వృత్తిని వదిలేసి దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా కోసం సందీప్ 36 ఎకరాల భూమి రూ. 1.5 కోట్లకు అమ్మినట్లు ఓ ప్రమోషనల్ వీడియోలో చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Samantha : చిన్న పిల్లలతో సమంత.. క్యూట్ ఫోటోలు షేర్ చేసి..
His Dedication fetched him profits 👌#SandeepReddyVanga #VijayDeverakonda #Arjunreddy
Follow us 👉 @tollymasti pic.twitter.com/GVV5Sv5LgO— Tollymasti (@tollymasti) December 7, 2023
ఇక సందీప్ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ విడుదలైన ప్రతి భాషలో సంచలన విజయం నమోదు చేసింది. నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ రణ్ బీర్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లోనే ఈ సినిమా రూ.563.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
కేవలం హిందీలోనే రూ.300 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. తెలుగులోనూ ఈ సినిమా కలెక్షన్స్ అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న యానిమల్ వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు అందుకోవడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని తెలుగు లో రిలీజ్ చేశారు. సందీప్ రెడ్డి వంగా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ తీయబోతున్నాడు. ఆ మూవీ తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం.