Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్ పై సముద్రఖని కామెంట్స్
Allu Arjun Arrest : ఏ కారణం చేత అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు? అసలు అల్లు అర్జున్ ఏం చేశారు
- By Sudheer Published Date - 06:22 PM, Sun - 29 December 24

అల్లు అర్జున్ అరెస్ట్ (Allu Arjun Arrest ) పై నటుడు సముద్రఖని (Sanudrakhani) రియాక్ట్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..అల్లు అర్జున్ ను అరెస్ట్ అవ్వడం ఇది ఏదో ఒక పీడకలలా అనిపించింది. ఏ కారణం చేత అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు? అసలు అల్లు అర్జున్ ఏం చేశారు. అసలు బన్నీ ఎలా, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా నాకు అర్థం కావడం లేదు.
నాకు తెలిసినంత వరకూ అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి. ఈ ఘటన ఒక దిష్టి లాంటిది. ఎందుకంటే పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా దూసుకుపోతుందో తెలిసిందే. ఖచ్చితంగా 3 వేల కోట్లకి పైగా వసూళ్లు ఆ సినిమా సాధిస్తుంది. ఇప్పటికే 1600 కోట్లకి పైగా సాధించింది. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 ఎంత వేగంగా వెళ్తుందో అంతే వేగంగా బయట ఈ అరెస్ట్ పరిణామాలు జరిగాయి. అయితే ఇది ఆయనకి ఓ దిష్టి లాంటిది అని నేను భావిస్తున్నాను. ఇది చాలా సాధారణమైన విషయం. ఆయన ఈజీగా దీన్ని దాటిపోతాడు.” అంటూ సముద్రఖని చెప్పుకొచ్చాడు.
బన్నీ కి సపోర్ట్ గా సముద్రఖని మాట్లాడడం తో అభిమానులు ఆయనకు థాంక్స్ చెపుతున్నారు. అల్లు అర్జున్ – సముద్రఖని కలిసి ‘అల వైకుంఠపురం’లో నటించారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ప్రస్తుతం సముద్రఖని వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ లో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
• @thondankani Anna about @alluarjun Arrest 💯🙌#Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/gxaQmxHbmE
— AAISABRAND ™ (@AAisABrand) December 29, 2024
Read Also : Telangana Crime Rate Report 2024 : తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్