HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Yashoda Movie Trailer Created By Curiosity

Yashoda Trailer: క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సమంత ‘యశోద’ సినిమా ట్రైలర్!

  • By hashtagu Published Date - 08:58 PM, Thu - 27 October 22
  • daily-hunt
Yashoda
Yashoda

యశోద’ ఎవరో తెలుసు కదా?
ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి!
– ట్రైలర్ చివరలో వినిపించిన డైలాగ్.

అప్పటికి ‘యశోద’ ఎవరని కాదు, ఎటువంటి మహిళ అనేది కూడా ప్రేక్షకులకు అర్థం అవుతుంది…. షి ఈజ్ ఎ మదర్, ఫైటర్ అండ్ వెరీ పవర్‌ఫుల్ వుమన్ అని! ఆ పాత్రలో సమంత అదరగొట్టారని!

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.

‘యశోద’ ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే…

‘యశోద’ టీజర్‌లో సమంత గర్భవతి అని చూపించారు. ట్రైలర్‌లో డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళ అని స్పష్టం చేశారు. అంటే ‘యశోద’ది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట! అక్కడితో కథ అయిపోలేదు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం… ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు.

సరోగసీ కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళలు పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ట్రైలర్ కట్ చేశారు.

‘యశోద’లో ప్రేమ ఉంది. ‘నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’ అని సమంత చెప్పే మాటలో బిడ్డపై తల్లి ప్రేమ వినబడుతుంది. సమంతకు, డాక్టర్ రోల్ చేసిన ఉన్ని ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ ఉందని హింట్ కూడా ఇచ్చారు. అంతే కాదు… ‘యశోద’లో క్రైమ్ ఉంది, రాజకీయం ఉంది, అన్నిటి కంటే ముఖ్యంగా మహిళ చేసే పోరాటం ఉంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

‘యశోద’ ట్రైలర్‌లో మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఖర్చుకు వెనుకాడలేదని తెలుస్తోంది. ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.

Was in love with her, when as a college kid I saw her on the big screen for the first time. Today I admire and adore her for everything she is ❤️

So very happy to share with you all @Samanthaprabhu2's new film #YashodaTrailer ▶️ https://t.co/uT9gyBAj62

In theatres 11-11-2022 pic.twitter.com/KcYMnvj8sf

— Vijay Deverakonda (@TheDeverakonda) October 27, 2022

ట్రైలర్ విడుదలైన సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”విజయ్ దేవరకొండ, సూర్య, రక్షిత్ శెట్టి, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్… మా ట్రైలర్ విడుదల చేసిన హీరోలందరికీ పేరు పేరునా థాంక్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ… అన్ని భాషల ప్రేక్షకుల నుంచి థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. సమంత నటన, కాన్సెప్ట్, మణిశర్మ నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుతున్నారు. సినిమా కాన్సెప్ట్ ఏంటనేది మేం ముందుగా చెప్పేశాం. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు కాన్సెప్ట్ తెలిసినప్పటికీ… నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని ఉత్కంఠ కలిగించే విధంగా కథ, కథనాలు ఉంటాయి. ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం” అని అన్నారు.

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Samantha
  • tollywood
  • Yashoda
  • yashoda trailer

Related News

Sam Fitness

Samantha Fitness : సమంత ఫిట్ నెస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!

Samantha Fitness : ప్రముఖ నటి సమంత గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల (మయోసైటిస్) నుండి కోలుకున్న తర్వాత, తన ఫిట్‌నెస్‌లో ఊహించని మార్పును సాధించి అభిమానులను ఆశ్చర్యపరిచారు

  • Aadhi Pinisetty

    Aadhi Pinisetty : అఖండ 2 పై షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేసిన ఆది!

  • Bhagyashree Borse

    Bhagyashree Borse : ‘అరుంధతి’గా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ హీరోయిన్..!

  • Naga Chaitanya

    Naga Chaitanya: NC24 నుంచి బిగ్ అప్డేట్‌.. మేకింగ్ వీడియో విడుద‌ల‌!

  • Suriya

    Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!

Latest News

  • 37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!

  • Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

  • Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

  • Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో మలుపు

  • iBOMMA Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ పై వర్మ రియాక్షన్ ఎలా ఉందంటే !!

Trending News

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd