Samantha : చిన్నపిల్లలతో సమంత ఆటలు.. ఈ పిల్లలు ఎవరో తెలుసా?
గత కొన్ని రోజులుగా బాలి(Bali) ట్రిప్ కి వెళ్లిన సమంత మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చింది. సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి(Chinmayi), ఆమె భర్త రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే.
- Author : News Desk
Date : 07-08-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
సమంత(Samantha) సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై పూర్తిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి మాయోసైటిస్(Myositis) చికిత్స తీసుకోనుంది సమంత. అయితే దానికి ముందు ఆహ్లాదకరంగా, మానసిక ప్రశాంతతో ఉండటానికి చూస్తుంది సమంత. కుక్కలు, పిల్లులతో ఆడుకోవడం, ధ్యానం చేయడం, ప్రకృతి ప్రదేశాలని సందర్శించడం వంటివి చేస్తుంది. తాజాగా పిల్లలతో సరదాగా ఆడుకుంటుంది సామ్.
గత కొన్ని రోజులుగా బాలి(Bali) ట్రిప్ కి వెళ్లిన సమంత మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చింది. సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి(Chinmayi), ఆమె భర్త రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. సమంత అనేక సార్లు రాహుల్ గురించి, చిన్మయి గురించి చెప్పింది. తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ఇక రాహుల్, చిన్మయి గత సంవత్సరం జూన్ లో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. దృప్త, శర్వాస్ అని ఒక పాప, ఒక బాబుకి జన్మనిచ్చారు.
తాజాగా సమంత చిన్మయి వాళ్ళింటికి వెళ్లి ఈ పిల్లలిద్దరితో సరదాగా ఆడుకుంటూ ఓ రెండు వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఒక వీడియోలో శర్వాస్ తో ఆడుకుంటూ నాకు దేవుడు ఇచ్చిన కొడుకు అని పోస్ట్ చేసింది. ఇక మరో వీడియోలో పిల్లలిద్దరితో కలిసి కుర్చీ లాగుతూ ఆడుకుంటుంది. ఈ వీడియోని పోస్ట్ చేసి ఇప్పుడు రాహుల్, చిన్మయిలని కిడ్నాప్ చేయడానికి దారి దొరికింది అని సరదాగా పోస్ట్ చేసింది. సమంత క్యూట్ గా చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటుండటంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
Always a Child 🤍🥹
Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) August 6, 2023
Also Read : Barbie-1 Billion Dollars : “బాక్సాఫీస్”లో బార్బీ మ్యాజిక్.. 8000 కోట్లు దాటిన కలెక్షన్స్