Samantha : సమంత మెరుపులు చూశారా..?
ముంబైలో జరిగిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా H&M న్యూ కలెక్షన్స్ లాంచింగ్ లో పాల్గొన్నది అమ్మడు. ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం లో సమంత
- By Ramesh Published Date - 12:29 PM, Fri - 23 August 24

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్ లోనే కనిపిస్తున్నారు. తను చేసిన సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ సందర్భంగా సమంత అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అందుకే ఆమె హైదరాబాద్ టు ముంబై చెక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ గా ముంబైలో జరిగిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా H&M న్యూ కలెక్షన్స్ లాంచింగ్ లో పాల్గొన్నది అమ్మడు. ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం లో సమంత ధరించిన డ్రెస్ కూడా అదిరిపోయింది. అనామిక ఖన్నా డిజైన్ చేసిన ఈ క్రాప్ టాప్ పెయిర్ తో సమంత మెరుపులు మెరిపిస్తుంది.
ఈ లాంచింగ్ ప్రోగ్రాం కి వచ్చిన వారంతా సమంత (Samantha) వైపే చూసేలా అమ్మడి అందం ఉంది. ప్రస్తుతం సమంతకు సంబందించిన ఈ డిజైనర్ వేర్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయని సమంత సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమాను అనౌన్స్ చేసింది. ఆ సినిమాతో పాటుగా రాజ్ అండ్ డీకే బాలీవుడ్ లో చేస్తున్న మరో వెబ్ సీరీస్ కు కూడా సమంత కో ప్రొడ్యూసర్ గా ఉంటుందని టాక్.
మొత్తానికి సౌత్ సినిమాలను, సౌత్ సినిమాలను వదిలి సమంత పూర్తిగా బాలీవుడ్ (Bollywood) మీదే తన ఫోకస్ అంతా పెట్టిందని తెలుస్తుంది. ఐతే తెలుగులో ఒకటి రెండు కమర్షియల్ సినిమా ఆఫర్లు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించిందని టాక్. సమంత మళ్లీ వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ సమంత మాత్రం బాలీవుడ్ ఈవెంట్స్ లోనే ఎక్కువ కనిపిస్తుంది. లేటెస్ట్ గా అనామిక ఖన్నా ఫ్యాషన్ వీక్ లో భాగమైంది. ఐతే సమంత ధరించిన ఈ క్రాప్ టాప్ ధర 19000 రూపాయలు అని తెలుస్తుంది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ కి ఆ అమౌంట్ చిన్నదే కానీ ధరకు తగినట్టుగానే బ్లాక్ క్రాప్ టాప్ సమంత అందాన్ని రెట్టింపు చేసిందని చెప్పొచ్చు.
తెలుగు మీడియా ముందుకు వచ్చే అవకాశం లేకపోవడం తో సమంత ఎక్కడ కనిపిస్తే అక్కడ మైకులు పెట్టేస్తున్నారు. గురువారం నాని(Nani)తో కలిసి ఎయిర్ పోర్ట్ లో సమంత కనిపించింది. ఇద్దరు కలిసే ముంబై వెళ్లినట్టు తెలుస్తుంది.
Also Read : Shruthi Hassan : స్క్రీన్ టైం పై శృతి హాసన్ అభ్యంతరాలు.. సలార్ లో అలా..!