Samantha: ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం సమంత బోల్డ్ షూట్, ఫొటో వైరల్
సమంత నటనకు కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు.. ఘాటైన అందాలను ప్రదర్శించడంలోనూ ముందుంటుంది.
- Author : Balu J
Date : 09-11-2023 - 3:48 IST
Published By : Hashtagu Telugu Desk
Samantha: టాలీవుడ్ నటి సమంత నటనకు కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు.. ఘాటైన అందాలను ప్రదర్శించడంలోనూ ముందుంటుంది. ఈ బ్యూటీ సినిమాలకు హాలీడే ప్రకటించి వెకేషన్, బీచ్ పార్టీలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ప్రదేశాలను చుట్టేసిన సమంత తాజాగా టిబెట్ లో గడుపుతోంది. అక్కడ మెడిటేషన్ చేస్తూ రీఛార్జ్ అవుతోంది. అయితే తాజాగా సమంత ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం సాహసోపేతమైన ఫోటోషూట్ చేసింది.
షూట్‌లో బ్లాక్ కలర్ V-ప్లంజ్ మోనోకిని ధరించి, తన టోన్డ్ బాడీనీ ప్రదర్శించింది. తన ఎద అందాలు, తోడలను చూపిస్తూ ఫోజులిచ్చింది. ఎప్పుడూ చూడని లుక్ లో కనిపించింది. గురువారం, సమంతా తన బోల్డ్ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత సమస్యలు, సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో అనవసర కథనాలు తాను డిప్రెషన్ బారిన పడేలా చేశాయన్నారు. ప్రస్తుతం సమంత ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: KTR: ఆర్మూర్ రోడ్ షోలో ఆపశృతి, మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం