Samantha : ఒక్క లైక్ తో మ్యాటర్ పెళ్లి దాకా తీసుకెళ్లారు.. సమంతకైనా తెలుసా..?
Samantha ఏదో సరదాగా సమంత కామెంట్ కి లైక్ కొట్టి ఉండొచ్చు. అయినంత మాత్రానా అర్జున్ సమంత ప్రేమలో ఉన్నారని వైరల్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ మొన్నటిదాకా మలైకాతో
- By Ramesh Published Date - 10:48 AM, Wed - 27 November 24

సమంత ఏం చేసినా సరే మీడియాలో అదో సెన్సేషనల్ అవుతుంది. దానికి రీజన్స్ ఏంటన్నది కూడా తెలియదు కానీ జస్ట్ సమంత ఏదైనా తన మనసులో మాటని వ్యక్తపరిస్తే చాలు దాని అర్ధం పరమార్ధం అంటూ ఒకటే హడావిడి చేస్తారు. సోషల్ మీడియాలో సమంత ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుండగా సమంత జస్ట్ ఏదైనా పోస్ట్ పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్ కు ఎవరైనా లైక్ కొడితే వారి గురించి కూడా వార్తలు రాస్తుంటారు.
లేటెస్ట్ గా సమంత (Samantha) తన సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టగా దానికి అర్జున్ కపూర్ లైక్ కొట్టాడు. అది చూసిన మీడియా వాళ్లు అర్జున్ కపూర్ లైక్స్ సమంత అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇంకొందరైతే వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని రాసుకొచ్చారు. అర్జున్ కపూర్ (Arjun Kapoor) ఏదో సరదాగా సమంత కామెంట్ కి లైక్ కొట్టి ఉండొచ్చు. అయినంత మాత్రానా అర్జున్ సమంత ప్రేమలో ఉన్నారని వైరల్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ మొన్నటిదాకా మలైకాతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు వారిద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారని తెలుస్తుంది.
సింగిల్ గా ఉండనంటూ..
ఈమధ్య సమంత సింగిల్ గా ఉండనంటూ హింట్ ఇవ్వగా ఇదిగో అర్జున్ కపూర్ లైక్ కొట్టగానే ఇంకేముందు సమంత పెళ్లి చేసుకునేది అతన్నే అంటూ హడావిడి మొదలు పెట్టారు. అసలు సమంత కు కూడా ఈ విషయం తెలుసా అన్నది కొందరి వాదన. ఏది ఏమైనా సమంత పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న అత్యుత్సాహం అంతా ఆమెకు పాజిటివ్ గానే అవుతుందని చెప్పొచ్చు.
ఈమధ్యనే సిటాడెల్ హనీ బన్నీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మా ఇంటి బంగారం అనే సినిమాను సొంతంగా నిర్మిస్తుంది. అంతేకాదు బాలీవుడ్ లో మరో వెబ్ సీరీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
Also Read : Sunday: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఆదివారం ఈ పరిహారాలు పాటించాల్సిందే!