Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..
- By Vamsi Chowdary Korata Published Date - 02:20 PM, Mon - 1 December 25

Samantha Raj
స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారన్న వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. గత కొంతకాలంగా సమంత–రాజ్ డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లు నిజమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Samantha Raj
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక–నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ప్రేమకథ నడుస్తోందన్న వార్తలు జోరుగా సాగాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ సోమవారం తెల్లవారుజామున వారిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. విశ్వసనీయ సమాచారం మేరకు, కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ పరిసరాల్లో ఉన్న ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుక పూర్తిగా వ్యక్తిగతంగా, ఎలాంటి హంగామా లేకుండా నిర్వహించినట్టు తెలుస్తోంది. పెళ్లిలో సమంత ఎరుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి సమంత, రాజ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజు సాయంత్రంలోగా సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Samantha Raj
సమంత– రాజ్ నిడిమోరు ల పరిచయం ‘సిటాడెల్: హనీ బన్నీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలో మొదలైంది. రాజ్–డీకే తెరకెక్కించిన ఈ రెండు ప్రాజెక్టుల్లో సమంత కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ప్రొఫెషనల్ బంధం కాస్తా వ్యక్తిగత అనుబంధంగా మారింది. ‘శుభం’ సినిమా సమయంలో ఈ జంట మరింత దగ్గరయ్యారని చెబుతున్నారు. ఆ చిత్రానికి సమంత నిర్మాతగా వ్యవహరించగా, రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఈ దశలో ఇద్దరూ పలు మీటింగులు, ప్రమోషన్లు చేయడానికి కలిసి హాజరయ్యారు. ఆ సందర్భాల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Samantha Raj
గత కొంతకాలంగా వీరు కలిసి ట్రిప్పులకు వెళ్లడం, హోటళ్లలో కనిపించడం, కొన్ని సందర్భాల్లో కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడం.. ఇవన్నీ డేటింగ్ రూమర్లకు ఊతమిచ్చాయి. ఇద్దరూ ఎప్పుడూ ఈ రూమర్లపై బహిరంగంగా స్పందించకపోయినా రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో సమంత రాజ్‌ను హత్తుకుని, క్లోజ్‌గా కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ప్రేమకథ నిజమన్న నమ్మకం అభిమానుల్లో పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి వార్త హల్‌చల్ చేస్తోంది. అభిమానులు, నెటిజన్లు ఇప్పటికే సోషల్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వస్తేనే అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.

Samantha Raj
సమంత, రాజ్ నిడిమారు ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. సమంత ఇంతకుముందు నటుడు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా సమంత కూడా రాజ్ నిడిమోరుతో కొత్త ప్రయాణంలోకి అడుగు పెట్టిందన్న వార్తతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Samantha Raj

Samantha Raj