Salman Khan: ఆ మూవీ కోసం సల్మాన్ ఖాన్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, కల్కీకి మించేలా
- By Balu J Published Date - 08:56 PM, Wed - 3 July 24
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సోలో హీరోగా తనదైన ముద్ర వేస్తూ.. ఇతర సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే వరుణ్ ధావన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బేబీ జాన్ డిసెంబర్ 25, 2024 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ, దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘తెరి’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్ తన కెరీర్ లోనే అత్యంత మాస్ రోల్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామాకు కలీస్ దర్శకత్వం వహిస్తుండగా, జియో స్టూడియోస్ తో కలిసి అట్లీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు మంచి హైప్ ఉందని, మసాలా ఎంటర్ టైనర్ నుంచి బేబీ జాన్ ఆశించినవన్నీ అందిస్తాడని ఫస్ట్ గ్లింప్స్ సూచించింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించనున్నాడనేది లేటెస్ట్ అప్ డేట్. బాలీవుడ్ మీడియా ప్రకారం.. సల్మాన్ ఖాన్, అట్లీ త్వరలో ఒక ఫీచర్ ఫిల్మ్ కోసం పనిచేయబోతున్నారు, అయితే అంతకంటే ముందు, అల్టీ వరుణ్ ధావన్ నటించిన చిత్రంలో భాగం కావడానికి అతన్ని ఒప్పించాడు. బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో కలిసి సల్మాన్ ఖాన్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ సీక్వెన్స్ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. గతంలో సల్మాన్ ఖాన్ వరుణ్ ధావన్ నటించిన జుడ్వా 2 చిత్రంలో అతిథి పాత్రలో నటించాడు. సల్మాన్ రాక బేబీ జాన్ హైప్ ను మరింత పెంచుతుంది. కీర్తి సురేష్, వామికా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Related News
Keerti Suresh : కీర్తి ఫోకస్ అంతా అక్కడే..?
Keerti Suresh మహానటి కీర్తి సురేష్ తన కెరీర్ ని బాలీవుడ్ కి షిఫ్ట్ చేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. సౌత్ లో స్టార్ స్టేటస్ అందుకుని నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్