Aishwarya Rai with Salman: ఐశ్వర్య – సల్మాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’.. ఓల్డ్ పిక్ వైరల్!
సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కు సంబంధించిన పాత ఫోటో (Old Pic) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- Author : Balu J
Date : 17-01-2023 - 12:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఐశ్వర్య-సల్మాన్.. (Aishwarya Rai and Salman Khan) అప్పటి బాలీవుడ్ రొమాంటిక్ జంట. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాయి. ఈ జంట మధ్య కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యేవాళ్లు. తాజాగా మాజీ జంటకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కు సంబంధించిన పాత ఫోటో (Old Pic) ఒకటి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో చేయడంతో ఈ పోస్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. సల్మాన్, ఐశ్వర్య (Aishwarya Rai and Salman Khan) రిలాక్స్ డ్ గా కూర్చొని ఫొటోకు పోజులివ్వడం చూడొచ్చు.
ఐశ్వర్య స్లీవ్‌లెస్ టాప్ ధరించి, చేతిలో టీ కప్పుతో ఉండగా, సల్మాన్ ముదురు నీలం రంగు చొక్కా, బూడిద రంగు ప్యాంట్‌లో కనిపించాడు. 1999లో సంజయ్ లీలా బన్సాలీ ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సెట్స్‌లో కలిసిన తర్వాత ఈ జంట ఇలా రిఫ్రెష్ అయ్యారు. కానీ 2002 నాటికి వీరిద్దరూ విడిపోయారు. ఐశ్వర్య 2007లో నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. కానీ కండలవీరుడు సల్మాన్ మాత్రం బ్యాచిలర్ గా మిగిలిపోయాడు. ఈ ఫొటో వైరల్ కావడంతో కొంతమంది అభిమానులు అభినందిస్తే, మరికొందరు వీరికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. అయితే ఈ జంట (Aishwarya Rai and Salman Khan) ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మానేసినప్పటికీ, జనవరిలో దర్శకుడు సుభాష్ ఘాయ్ 74వ పుట్టినరోజు వేడుకలో వారు (వేరుగా) కనిపించారు.
బ్రేకప్ కు కారణాలివే..
ఐశ్వర్య సల్మాన్ ల పెళ్లి జరగాల్సి ఉన్నా సల్మాన్ ఖాన్ చేసిన చిన్నచిన్న తప్పుల వల్లే ఆ పెళ్లి ఆగిపోయిందని సల్మాన్ ఖాన్ సన్నిహితులు చెబుతుంటారు. సినిమా ఇండస్ట్రీలోకి (Bollywood) ఐశ్వర్యారాయ్ నటిగా ఎంట్రీ ఇచ్చే సమయానికి సల్మాన్ ఖాన్ స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. హల్ దిల్ దే చుకే సనమ్ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ హీరో కాగా ఆ సినిమాలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యే నాటికి ఐశ్వర్య, సల్మాన్ ప్రేమలో ఉన్నారు. సల్మాన్ తన కుటుంబ సభ్యులను (Family members) ఐశ్వర్యకు పరిచయం చేయగా ఐశ్వర్య తరచూ సల్మాన్ ఇంటికి వస్తూ ఉండేవారు. అయితే ఐశ్వర్యారాయ్ తల్లిదండ్రులకు మాత్రం ఐశ్వర్య సల్మాన్ ను ప్రేమించడం నచ్చలేదు.
సల్మాన్ ను పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య భావించినా పెళ్లి (Marriage) తర్వాత ఆఫర్లు తగ్గుతాయని భావించి ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒక సందర్భంలో సల్మాన్ ఐశ్వర్యా రాయ్ ఉంటున్న అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లి కిందకు దూకేస్తానని బెదిరించారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ వల్ల ఐశ్వర్యారాయ్ కు ఛల్తే ఛల్తే సినిమాలో ఛాన్స్ పోయింది. సల్మాన్ ప్రవర్తన (Character) వల్ల కెరీర్ ప్రమాదంలో పడేలా ఉండటంతో 2002 సంవత్సరం మార్చి నెలలో ఐశ్వర్య సల్మాన్ కు బ్రేకప్ చెప్పారు. ఆ తరువాత భవిష్యత్తులో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించనని ఐశ్వర్యారాయ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. సల్మాన్ ప్రవర్తనే ఐశ్వర్యతో బ్రేకప్ కు కారణమని అతని ఫ్యాన్స్ (Fans) అభిప్రాయపడుతున్నారు.
Also Read: Army Soldiers: ఆర్మీ జవాన్ల మానవత్వం.. గర్భిణిని 14 కిలోమీటర్లు మోసి, ఆస్పత్రికి తరలించి!